AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: ‘రాజీనామా చేసే దమ్ముందా’.? సీఎమ్‌ కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌..

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్... నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా.... మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్ చెయ్... బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో...

Bandi Sanjay: 'రాజీనామా చేసే దమ్ముందా'.? సీఎమ్‌ కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌..
Bandi Sanjay
Narender Vaitla
|

Updated on: Feb 13, 2023 | 7:07 AM

Share

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్… నువ్వు చెప్పినవన్నీ అబద్దాలని నిరూపిస్తా…. మాటకు కట్టుబడి రాజీనామా చేసే దమ్ముందా? డేట్, టైం ఫిక్స్ చెయ్… బహిరంగ చర్చకు సిద్ధం.. ఆధారాలతో నిరూపిస్తా’’నంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు రైతుల వద్దకు పోయి చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలను రైతులంతా ఉరికించి కొడతారని వ్యాఖ్యానించారు. దేశ జీడీపీ గురించి కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్దిక వ్యవస్థగా ఎదిగిన విషయాన్ని ఐఎంఎఫ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే అసెంబ్లీలో అబద్దాలాడారని విమర్శించారు. కేసీఆర్ పెద్ద డిఫాల్టర్ ముఖ్యమంత్రి అని, ఆయన మాటలు నమ్మేదెవరని అన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టినా 56 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా దాచిన కేసీఆర్ మోదీ పాలన గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఏమైందో చెప్పాలని, ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. పహిలీ బార్ దళిత్ సర్కార్ ఎంత నిజమో…. అబ్ కీ బార్ ఆబ్కారీ సర్కార్ అంతే నిజమని ఎద్దేవా చేశారు. అబద్దాలతో అసెంబ్లీని మలినం చేసిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. 2024లో మోదీ ప్రభుత్వం పనైపోతోందంటూ కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ… ‘‘ఈ ఏడాదే కేసీఆర్ ఖేల్ ఖతం కాబోతోంది. ప్రజలు బీఆర్ఎస్ ను పాతిపెట్టబోతున్నారు’’అని అన్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను ఎందుకు ఓడిస్తారో చెప్పిన బండి సంజయ్ బీజేపీకి ఎందుకు ఓటేస్తారనే విషయాన్ని వివరించారు.

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను నమ్మించే ప్రయత్నించడం దుర్మార్గం… ఆయన అబ్దాలకు అసెంబ్లీ మలినమైంది. మోదీని తిట్టడానికి, కేంద్రాన్ని బదనానికి తప్ప అసెంబ్లీలో మాట్లాడిందేమీలేదు. బడ్జెట్ ప్రస్తావనే లేదు. ప్రజల దారి మళ్లించేందుకు అన్నీ అబద్దాలు వల్లించిండు. పార్లమెంట్ లో మోదీ ప్రసంగాన్ని ప్రపంచమంతా మెచ్చుకోవడంతో… ఆయనతో పోల్చుకోవడానికి కేసీఆర్ నానా తంటాలు పడ్డరు.సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా? గతంలో నేను పార్లమెంట్ లో మాట్లాడితే నాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు కదా… ఇయాళ మీరు చేసిందేమిటి? కేసీఆర్ నుఇతర రాష్ట్రాల ప్రజలు, పార్టీలు నిన్ను జోకర్ లా చూస్తున్నరు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్దాలే… ఆధారాలతో సహా నిరూపించేందుకు మేం సిద్ధం. రాజీనామాకు సిద్ధం కావాలి. డేట్, టైం డిసైడ్ చెయ్… మేం నిరూపిస్తాం.. రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధమా? తెలంగాణకు పట్టిన శని పోతది. దమ్ముంటే చెప్పిన మాటకు కట్టుబడాలి.

ఇవి కూడా చదవండి

నీ బిడ్డ లిక్కర్ స్కాంపై ఇంతవరకు నోరు మెదపలేదు… ఇయాళ ఎవరో పుస్తకం రాస్తే అసెంబ్లీలో చదివి విన్పించి మోదీని తిడతావా?… నీపై లక్షల పుస్తకాలు రాశారు. ఎవడి పాలైందరో తెలంగాణ అని పాటలు రాశారు.. అవి అసెంబ్లీలో చదివి విన్పిస్తావా? కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదా? మరి ఎవరిచ్చారు? పాకిస్తాన్, చైనా ఇచ్చిందా? ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హామీ ఏమైంది? ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేవు. స్టాఫ్ నియామకాల్లేవు. దేశ ఆర్దిక వ్యవస్థ గురించి అడ్డగోలుగా అబద్దాలు… 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు జీడీపీ గురించి తెల్వదా? ఆర్దిక వ్యవస్థతో ప్రపంచం అల్లాడుతోంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానులే రాజీనామా చేసి దిగిపోయారు.. ప్రపంచమంతా దేశ ఆర్ధిక వ్యవస్థవైపే చూస్తోంది. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్దిక వ్యవస్థ మనదే. 11 నుండి 5వ స్థానానికి చేరుకున్నాం. దీనికి కారణం ఎవరు మోదీ కాదా? నీకు ఇష్టమైన పాకిస్తాన్ పిండికోసం కొట్టుకుని చస్తున్నారు. శ్రీలంక బిచ్చమెత్తుకుంటోంది. చైనా అల్లాడుతోందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..