Governor Tamilisai: అడ్డగోలుగా కామెంట్ చేస్తే చూస్తూ ఉండను.. బాడీషేమింగ్ చేసేవాళ్లకు గవర్నర్ తమిళిసై వార్నింగ్..
ఇవి కామెంట్స్ కాదు.. బాడీ షేమింగ్. ఓ మహిళపై, అదీ కక్షకట్టినట్టుగా రెచ్చిపోతున్న కొందరు శాడిస్టుల నైజం. అలాంటి కామెంట్లకే ఘాటుగా మాట్లాడారామె.
నల్లగా ఉన్నారని, పొట్టిగా ఉన్నారని, నదురు బట్టతలలా ఉందని ఎలా పడితే అలా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ని సోషల్ మీడియాలో చాలాసార్లు చాలామంది అడ్డగోలు కామెంట్స్ చేశారు. ఇవి కామెంట్స్ కాదు.. బాడీ షేమింగ్. ఓ మహిళపై, అదీ కక్షకట్టినట్టుగా రెచ్చిపోతున్న కొందరు శాడిస్టుల నైజం. అలాంటి కామెంట్లకే ఘాటుగా మాట్లాడారామె. నా రంగు, ఎత్తు గురించి కొందరు పదేపదే విమర్శలు చేస్తున్నారు.. హేళన చేస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోసారి ఎవరైనా నల్లగా ఉన్నానని కామెంట్ చేస్తే అగ్గిరవ్వనవుతా అంటూ వ్యాఖ్యానించారామె. హేళన చేసిన వాళ్లు ఓర్వలేనంత ఉన్నతస్థానానికి ఎదుగుతా అన్నారు.. !
తమిళనాడులోని తండయార్‌పేట్‌లో వినిపించాయి తమిళిసై వార్నింగ్స్. అక్కడ ఓ బాలకల ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన తమిళిసై.. మిగతా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగానే కొందరు శాడిస్టులు ఎలా ప్రవర్తిస్తారో, తనను ఎగ్జాంపుల్‌గా చూపించారు. హేళనలకు తలొగ్గొద్దని, అగ్గిరవ్వలా మారాలని సూచించారామె.
చెన్నైలోని తాండయార్‌పేటలోని ఓ ప్రైవేట్ బాలికల పాఠశాల వార్షికోత్సవం జరిగింది. తెలంగాణ గవర్నర్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ఏడాది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో విద్యావిషయాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. నాపై అడ్డగోలుగా కామెంట్ చేస్తే చూస్తూ ఉండను అని హెచ్చరించారు. నన్ను నల్లగా పిలిస్తే నేను నిప్పులా మారి పైకి లేస్తాను. మీరు నన్ను ఆకతాయి అని పిలిస్తే, నేను నిప్పుకణంగా మారతా అంటూ హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం