Teaching Jobs: కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే.

అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.?

Teaching Jobs: కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే.
Atomic Energy Central School
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 13, 2023 | 9:39 AM

అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2023-24 ఏడాదికి గాను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ (తెలుగు), టీజీటీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పీఈటీ, ఆర్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎల్‌ఈడీ, డిగ్రీ, పీ,ఈ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

* ప్రిపరేటరీ టీచర్‌, పీఆర్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 30 ఏళ్లు, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ప్రిపరేటరీ టీచర్, పీఆర్‌టీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.21250, టీజీటీ పోస్టులకు రూ.26250 జీతంగా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్డ్‌ కాపీలను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్‌, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 21-02-2023ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!