Jobs in canada: ఉద్యోగం కావాలా? రండి బాబూ రండి.. కెనడాలో లక్షా 50వేల ఉద్యోగాలు
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిరుద్యోగులకు తీపికబురు తెలిపారు. కొత్త వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ తాత్కాలిక కార్మికులకు ఆహ్వానం పలికేందుకు..
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిరుద్యోగులకు తీపికబురు తెలిపారు. కొత్త వలసదారులు, అంతర్జాతీయ విద్యార్థులు, విదేశీ తాత్కాలిక కార్మికులకు ఆహ్వానం పలికేందుకు జస్టిస్ ట్రూడో తీసుకొచ్చిన నూతన విధానాలు ప్రపంచంలోని నిరుద్యోగులను ఊరిస్తున్నాయి. ఈ పరిణామంతో జనవరిలో రికార్డు స్థాయిలో 1,50,000 కొత్త ఉద్యోగాలు జత అయ్యాయి. మీడియా అంచనాలకు 10 రెట్లు అధికం కావడం విశేషం. డిసెంబరులో కూడా కేవలం 5,000 ఉద్యోగాలు జతవుతాయని అంచనా వేయగా దాదాపు 70 వేల మందికి జాబ్ ఆఫర్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
కెనడాలో ఉద్యోగ కల్పన అంచనాలను మించి వృద్ధి చెందుతోందనడానికి ఇదే నిదర్శనం. సెప్టెంబరు నుంచి కెనడా ఆర్థిక రంగం మొత్తం 3,26,000 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. దీంతో తొలిసారి రెండు కోట్ల ఉద్యోగుల సంఖ్యను కెనడా నమోదు చేసింది. పైగా ఆ దేశ నిరుద్యోగ రేటు కేవలం 5 శాతం వద్ద కొనసాగుతున్నట్లు ఒట్టావాలో స్టాస్టిక్స్ కెనడా ఫిబ్రవరి 10న నివేదించింది. తాజా పరిస్థితి చూస్తుంటే కెనడా జాతీయ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ కెనడా వడ్డీ రేట్లను నిజంగా పెంచిందో.. లేదో.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బ్లూంబర్గ్ తన తాజా సర్వేలో ఈ మేరకు వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.