AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki Cars: మార్కెట్‌లోకి మారుతీ సుజుకీ బడ్జెట్ కార్.. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ..

మారుతీ సుజుకి మరో కొత్త కార్‌ను రిలీజ్ చేసింది. టూర్ ఎస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్లు కచ్చితంగా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెడాన్ విభాగంలో వచ్చిన టూర్ ఎస్ కార్లు రూ.6.50 లక్షల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

Maruti Suzuki Cars: మార్కెట్‌లోకి మారుతీ సుజుకీ బడ్జెట్ కార్.. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ..
Maruthi Tour S
Nikhil
|

Updated on: Feb 13, 2023 | 12:15 PM

Share

భారతదేశంలో ఎక్కువ మంది కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా కార్లను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా కంపెనీలు కూడా కొత్త కార్లను లాంచ్ చేస్తున్నారు. ఇండియా మారుతీ సుజుకీ కార్లు అంటే ఓ డిమాండ్. ఈ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లను తయారు చేస్తుందని అందరి నమ్మకం. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకి మరో కొత్త కార్‌ను రిలీజ్ చేసింది. టూర్ ఎస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కార్లు కచ్చితంగా మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెడాన్ విభాగంలో వచ్చిన టూర్ ఎస్ కార్లు రూ.6.50 లక్షల నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఈ కార్లు ఎస్‌టీడీ (ఓ), ఎస్‌టీడీ (ఓ) సీఎన్‌జీ వెర్షన్లతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. ప్రెట్రోల్‌తో నడిచే ఎస్‌టీడీ (ఓ) ధర రూ.6.5 లక్షలు కాగా సీఎన్‌జీ వెర్షన్ ధర రూ.7.36 లక్షలుగా ఉండనుంది. 

టూర్ ఎస్ కార్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్‌తో 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ కార్లు 6000 ఆర్‌పీఎం వద్ద 89 బీహెచ్‌పీ, 4400 ఆర్‌పీఎం వద్ద 133 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  అలాగే సీఎన్‌జీ వెర్షన్‌లో అయితే 6000 ఆర్‌పీఎం వద్ద 76 బీహెచ్‌పీ, 4300 ఆర్‌పీఎం వద్ద 98.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టూర్ ఎస్ కార్ లీటర్‌కు దాదాపు 23 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే ఇందులోని సీఎన్‌జీ వెర్షన్ అయితే 32 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సెఫ్టీ టెక్ వంటి అధునాతన ఫీచర్లతో ఈ కార్ వస్తుంది. అలాగే ఈ కార్‌లో డ్యుయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్‌తో వచ్చే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ల వంటి సదుపాయాలతో ఈ కార్ కస్టమర్ల మనస్సును దోచుకుంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..