APSSDC Interviews: మార్చి 7న నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు.. ఎంపికైతే ఆకర్షణీయ జీతంతో జాబ్ గ్యారెంటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మాచవరం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మాచవరం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో మార్చి 7వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి నరేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రూమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు.
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్ధులు సివిల్, అగ్రికల్చర్ మినహా ఏదైనా డిప్లొమా కోర్సు లేదా డిగ్రీ బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలని తెలిపారు. వయోపరిమితి 26 సంవత్సరాల్లోపు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఇతర పూర్తి వివరాలకు 80087 42842 లేదా 63050 04318 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.