Manchu Manoj Marriage: తమ్ముడి వివాహ వేడుకలో విష్ణు చేసిన పనికి అంతా షాక్‌..! అదేంటంటూ నెట్టింట గుసగుసలు

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో..

Manchu Manoj Marriage: తమ్ముడి వివాహ వేడుకలో విష్ణు చేసిన పనికి అంతా షాక్‌..! అదేంటంటూ నెట్టింట గుసగుసలు
Manchu Manoj Marriage
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 06, 2023 | 10:01 AM

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌, దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో శుక్రవారం (మార్చి 3) మనోజ్‌-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఐతే వీరి వివాహం మంచు మోహన్‌ బాబుకు ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వార్తలన్నింటినీ బ్రేక్‌ చేస్తూ మోహన్‌ బాబు దగ్గరుండి వీరి పెళ్లి జరిపించారు. ఐతే పెళ్లిలో మంచు కుటుంబ సభ్యులందరూ కనిపించినా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

భార్య, పిల్లల‌తో త‌మ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి సభ్యుడిగాకాకుండా.. గెస్టులా ఉండి కనీసం 30 నిముషాలు కూడా ఉండకుండా వెంటనే వెళ్లిపోయాడు. పెళ్లికి వచ్చిన వారంతా ఇది చూసి షాకయ్యారు. సొంత అన్న అయ్యుండి అతిథిలా రావడం ఏమిటి? వాళ్ల మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా ఇలాంటి సమయాల్లో కలిసిపోవాలేగానీ ఇలా చేయడం ఏంటంటూ అక్కడున్నవారందరూ గుసగుసలాడుకున్నారు. మరోవైపు మంచు లక్ష్మీ మాత్రం మనోజ్‌ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఐతే వీటిల్లో ఏ ఒక్క ఫోటోలో కూడా విష్ణు దంపతులు కనిపించకపోవడం విశేషం. దీంతో ప్రస్తుతం మంచు వారి పెళ్లి వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.