Wife attacks Husband: వైసీపీ నాయకుడిని చితకబాదిన భార్య.. ఆడవాళ్ళకి కోపం వస్తే అంతే..!

Wife attacks Husband: వైసీపీ నాయకుడిని చితకబాదిన భార్య.. ఆడవాళ్ళకి కోపం వస్తే అంతే..!

Anil kumar poka

|

Updated on: Mar 06, 2023 | 9:48 AM

రోజూ వేధింపులకు గురిచేస్తున్న వైసీపీ నేతను చితకబాదింది భార్య. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెరుపుతున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది.

రోజూ వేధింపులకు గురిచేస్తున్న వైసీపీ నేతను చితకబాదింది భార్య. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెరుపుతున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. బెల్లంకొండకు చెందిన వైసీపీ గ్రామ అధ్యక్షుడు గుర్రాల షేక్‌ కరిముల్లా అలియాస్‌ బడాబాచ్చా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిత్యం మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా భర్త ఇంటికి తన బంధువుతో వచ్చి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకుడు ఆమెను దుర్భాషలాడటంతో ఆగ్రహానికి గురై భర్తకు దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గాయపడిన అతన్ని 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ranbir Kapoor: సెలబ్రిటీ లైఫ్ ఈజీ కాదంటున్న రణబీర్.. ఏమైయింది అంటే..? వీడియో

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 06, 2023 09:48 AM