AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మారిన పొత్తుల అంశం

Andhra Pradesh News: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా ఇప్పుడు అక్కడ పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార, విపక్ష నేతల మాటల తూటాలు, పొత్తుల ప్రస్తావనలతో ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి.

AP Politics: ఏపీలో వేడెక్కుతున్న రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మారిన పొత్తుల అంశం
Somu Veerraju-Chandrababu-Pawan Kalyan
Janardhan Veluru
|

Updated on: Jun 07, 2022 | 4:55 PM

Share

AP Political News: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా ఇప్పుడు అక్కడ పొత్తుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. అధికార, విపక్ష నేతల పొత్తుల ప్రస్తావనలతో ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. సీఎం అభ్యర్థిపైనా అక్కడి రాజకీయం కాకరేపుతోంది. ఏపీలో రాజకీయ పొత్తుల అంశానికి సంబంధించిన టాప్-9 అంశాలు ఏంటంటే..

  1.  ఎన్నికలకు రెండేళ్ల టైమ్‌ ఉంది. ముందస్తు పవనాలు ముసురుకోలేదు. కానీ ఏపీలో అప్పుడే రాజకీయం వేడెక్కింది. మిత్రుల(బీజేపీ, జనసేన) మధ్య సీఎం సీటు పంచాయతీ మొదలైంది. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చేందుకు ప్రతిపక్షాలు కుస్తీ పడుతున్నాయి.
  2. పొత్తుల వ్యవహారంపై బీజేపీతో పాటు టీడీపీలోనూ చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు కుదిరినా పవనే సీఎం అభ్యర్థి అంటోంది జనసేన. ఆ పార్టీ వ్యూహాలు, నేతల కామెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తోంది టీడీపీ. పొత్తులపై ఆచితూచి స్పందిస్తోంది.
  3. పవన్ కల్యాణ్‌ పొత్తు కామెంట్స్‌పై ఏపీ బీజేపీ కోర్‌ కమిటీలో కూడా చర్చ నడిచింది. పవన్‌ మాటల వెనుక ఆంతర్యాన్ని, పొత్తు అంశాలపై లోతుగా విశ్లేషణ జరిగినట్లు తెలుస్తోంది. పొత్తులపై రాష్ట్ర నేతలెవ్వరూ నోరు మెదపొద్దని నడ్డా ఆదేశించారు.
  4. పవన్ మూడు ఆప్షన్లను.. సీఎం అభ్యర్థిగా జనసేన నేతల డిమాండ్లపై పెద్దగా రియాక్ట్‌ కావొద్దని ఏపీలోని పార్టీ శ్రేణులకు సూచించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
  5. ఇవి కూడా చదవండి
  6. పవన్‌ తమతో టచ్‌లో ఉన్నారని.. తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నామని వివరించారు నడ్డా. ఎన్నికల టైమ్‌లో ఏ పార్టీతో ఎలా వ్యవహరించాలనేది పార్టీ హైకమాండ్ పరిధిలో అంశమని.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 18 రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చిన హైకమాండ్‌కు ఏపీని ఎలా డీల్‌ చేయాలో తెలీయదని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
  7. ఏపీలో బీజేపీకి బూస్ట్‌ ఇస్తున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కమిటీతో సమావేశం నిర్వహించిన నడ్డా.. ప్రస్తుతం రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. రాజమండ్రి అడ్డాగా నడ్డా ఏదైనా బాంబు పేలుస్తారా? పొత్తులపై ఇన్‌ డైరెక్ట్‌ సిగ్నల్స్‌ పంపిస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
  8. పవన్‌ రియల్‌ హీరో కాదు, రీల్‌ హీరో అని విమర్శించారు మంత్రి రోజా. పదవుల కోసం ఆరాటం తప్ప, జనం కోసం ఆయన చేసిందేమీ లేదని, చేసేదేమీ లేదన్నారు. తిరుపతిలో వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు మంత్రి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 160 స్థానాలు తమవేనన్నారు రోజా.
  9. పవన్‌ కల్యాణ్‌ రియల్‌ హీరోనో, రీల్‌ హీరోనో ఎన్నికలే తేలుస్తాయంటున్నారు జనసేన నేతలు. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఇస్తున్నారు.
  10. నడ్డా నోట పవన్‌ కల్యాణ్‌మాట రావాల్సిందే అంటున్నారు జనసేన నేతలు. ఈ టూర్‌లో ఆయన కచ్చితంగా మాట్లాడాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే తమ కార్యాచరణ ఏంటో చర్చించి ప్రకటిస్తామంటున్నారు.

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి..