AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: 76 వాట్సప్‌ నెంబర్ల నుంచి యువతి ఫోన్‌కు న్యూడ్ ఫోటోలు.. ఇది ఆ దరిద్రుల పనే

తీసుకున్న లోన్‌కు ఒక్కోసారి 2 నుంచి 4 రెట్లు సొమ్ము ముక్కుపిండి వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. తాము అంత కట్టమని చెప్పినా.. ఇదేం ఇంట్రస్ట్ రేటు అని ప్రశ్నించినా వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతున్నారు.

Vijayawada: 76 వాట్సప్‌ నెంబర్ల నుంచి యువతి ఫోన్‌కు న్యూడ్ ఫోటోలు.. ఇది ఆ దరిద్రుల పనే
Woman Harassed By Loan App
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2022 | 5:10 PM

Share

Loan App Harassment: పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇనిస్టెంట్ లోన్ పేరుతో ఎర వేసి.. ఆ ట్రాప్‌‌లో పడినవాళ్ల నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఇలాంటి కేసులు ఎక్కడో చోట నమోదవుతూనే ఉన్నాయి. యాప్ ద్వారా లోన్ తీసుకొన్న బాధితుల పట్ల పైచాచికత్వాన్ని చాటుకున్నారు నిర్వాహకులు. తొలుత లోన్ ఇచ్చి, తర్వాత అధికంగా డబ్బు కట్టాలంటూ వేధిస్తూనే.. బాధితులు ఫోటోలను అశ్లీల ఫొటోలతో మార్పింగ్ చేసి.. వాటిని పంపి మరింత ఇబ్బందులు గురిచేస్తున్నారు. తీసుకున్న లోన్‌కు ఒక్కోసారి 2 నుంచి 4 రెట్లు సొమ్ము ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాము అంత కట్టమని చెప్పినా.. ఇదేం ఇంట్రస్ట్ రేటు అని ప్రశ్నించినా వెంటనే యాక్షన్‌లోకి దిగిపోతున్నారు.  అదేమని ప్రశ్నించిన వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి బెదిరిస్తున్నారు.

4 రోజుల క్రితం కొండపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఇదే తరహాలో వేధించారు. తాజాగా విజయవాడ జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం వైఎస్సార్‌ కాలనీకి చెందిన మరో యువతి (25)ని ఇదే తరహాలో టార్చర్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న యువతి.. కుటుంబ అవసరాల నిమిత్తం 18 ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ల నుంచి రూ.55,435 లోన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ.2,00,750 EMI పద్దతిలో తిరిగి పే చేశారు. ఇంకా బాకీ ఉన్నారంటూ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల ఉద్యోగులు ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. యువతి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, న్యూడ్ ఫోటోలను క్రియేట్ చేసి ఆమె నంబర్‌కు పంపించారు. ఇలా ఆమె సెల్‌ఫోన్‌కు 76 వేర్వేరు వాట్సప్‌ నెంబర్ల ద్వారా మార్ఫింగ్‌ ఫోటోలు పంపించారు. మరో 4 సెల్‌ఫోన్ల నుంచి వాయిస్‌ మెసేజ్‌లు పంపించి లోన్ చెల్లించాలని బెదిరించారు. బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..