TTD: ధర్మారెడ్డి రిటైర్ అవగానే కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారు.. జనసేన షాకింగ్ కామెంట్స్

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై(TTD EO Dharmareddy) జనసేన నేత కిరణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రిటైర్ అవగానే వైసీపీ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని ఆరోపించారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించడంపై తాము కోర్టుకు...

TTD: ధర్మారెడ్డి రిటైర్ అవగానే కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారు.. జనసేన షాకింగ్ కామెంట్స్
Ttd Eo Dharma Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 07, 2022 | 12:43 PM

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై(TTD EO Dharmareddy) జనసేన నేత కిరణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన రిటైర్ అవగానే వైసీపీ తరఫున కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారని ఆరోపించారు. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగించడంపై తాము కోర్టుకు వెళ్తున్నామని వివరించారు. ధర్మారెడ్డి ఏం మాయ చేసి తన డిప్యూటేషన్ పొడిగించుకున్నారో తెలియదన్న కిరణ్.. ముఖ్యమంత్రి జగన్ కు ఏపీకి ప్రత్యేక హోకదా, నిధులు అవసరం లేదని అన్నారు. తిరుమల ఈవోగా ధర్మారెడ్డి కొనసాగడమే ఆయనకు కావాలని విమర్శించారు. ధర్మారెడ్డి కొనసాగింపుపై ఆయనకంటే ముందే బీజేపీ(BJP) నాయకులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించచక తప్పదని హెచ్చరించారు. వెంకన్నతో పెట్టుకుంటే రెండింతలు అనుభవిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి గురించి మాట్లాడాల్సిన అవసరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తమకు అప్పగించారని చెప్పారు. ధర్మారెడ్డి విషయంలో అవసరమైతే బీజేపీ అధిష్టానంతో మాట్లాడతామని వెల్లడించారు.

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డిని కొనసాగిస్తూ.. ఏపీలో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ అధికారి అయిన ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీస్‌కు వచ్చారు. మే 14తో ధర్మారెడ్డి ఏడేళ్ల డిప్యుటేషన్‌ కాలం ముగిసింది. ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ పదవికాలం ముగియడంతో కొనసాగింపు కోసం కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన విజ్ఞ‌ప్తికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి