Kuppam Politics: కాక రేపుతోన్న కుప్పం మున్సిపల్‌ పోరు.. బాబు కోటలో పాగా వేసేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు!

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాక రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వార్‌ పీక్‌కి చేరింది.

Kuppam Politics: కాక రేపుతోన్న కుప్పం మున్సిపల్‌ పోరు.. బాబు కోటలో పాగా వేసేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు!
Kuppam Politics
Follow us

|

Updated on: Nov 09, 2021 | 5:52 PM

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు కాక రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వార్‌ పీక్‌కి చేరింది. బాబు కోటలో పాగా వేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ఏకంగా కుప్పంలోనే మకాం వేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తెలుగుదేశం పార్టీ.. కనీసం కుప్పుం గెలిచి పరువు నిలుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అటు అధికార పక్షానికీ, ఇటు ప్రతిపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారడంతో కుప్పం పోరు హీట్ పుట్టిస్తోంది.

అన్ని మున్సిపాలిటీలూ ఒక లెక్క-కుప్పం ఇంకో లెక్క. ఎందుకంటే, ఇది తెలుగుదేశం అధినేత సొంత నియోజకవర్గం. అంటే, చంద్రబాబుకి కంచుకోట. అందుకే, కుప్పం కోటను బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుంది వైసీపీ. కుప్పంలో పాగా వేయడం ద్వారా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నే దెబ్బతీయాలన్నది అధికార పార్టీ వ్యూహం. కుప్పంలో గెలవడం ద్వారా టీడీపీయే కాదు చంద్రబాబు కథ కూడా ముగిసిందనే సంకేతాలను పంపేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. అధికార పార్టీ ఎత్తులతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. సొంత కోటలో పట్టునిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు అధికారపక్షం, ఇటు ప్రతిపక్షం కుప్పంలో హోరాహోరీగా తలపడుతుండటంతో యుద్ధ వాతావరణం నెలకొంది.

అసలు, నామినేషన్లు కూడా మొదలుకాక ముందు నుంచే రాజకీయాలు వేడి పుట్టించింది. నామినేషన్స్‌ విత్‌డ్రా వరకు కంటిన్యూ అయ్యింది. అక్రమంగా దౌర్జన్యంతో గెలవాలని వైసీపీ చూస్తోందన్నది టీడీపీ ఆరోపణ. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నుంచి ఆర్వో వరకు అందరూ అధికార పార్టీకి తొత్తులుగా మారారని అంటోంది. ఫోర్జరీ సంతకాలతో అక్రమ విత్‌డ్రాస్ చేయించి ఏకగ్రీవాలు చేస్తున్నారని టీడీపీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. ఆర్వో ఆఫీస్‌ ముందు టీడీపీ ఆందోళనల తర్వాత కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిట్యువేషన్ సీరియస్‌గా మారడంతో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. స్థానికేతరులంతా కుప్పం వదిలి వెళ్లాలని పోలీసులు సూచించారు.

ఇదిలావుంటే, కుప్పం.. మున్సిపాలిటీగా మారిన తర్వాత ఫస్ట్ టైమ్‌ ఎలక్షన్స్‌ జరుగుతుండటంతో హైవోల్టేజ్ వార్ జరుగుతోంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా, అన్నింటినీ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలన్న కసితో వైసీపీ ముందుకెళ్తోంది. మంత్రి పెద్దిరెడ్డితోపాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు, తెలుగుదేశం కూడా అధికార పార్టీకి ధీటుగా దూసుకుపోతోంది. అయితే, నామినేషన్లలోనే ఇంత రచ్చ జరిగితే, ఇక పోలింగ్ ముగిసేలోపు ఇంకెంత రగడ జరుగుతుందో మరి..

Read Also….  Hyderabad Metro Rail: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు