Anil kumar poka |
Updated on: Nov 09, 2021 | 6:12 PM
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోస్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు.
ఒడిశా సచివాలయంలో ఈ ఇద్దరు సీఎంలు మూడు ముఖ్య అంశాలపై చర్చించనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఒడిశా సీఎం, ఏపీ సీఎం చర్చించనున్నారు.
ముఖ్యంగా వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలు చర్చకు రానున్నాయి.
ఒడిశా సీఎంతో చర్చించనున్న ఈ మూడు అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసింది ఏపీ ప్రభుత్వం.