AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎయిడెడ్‌ కాలేజీల ఇష్యూని తెలుగు దేశం పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy: అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy
Balaraju Goud
|

Updated on: Nov 09, 2021 | 5:12 PM

Share

Sajjala Hot Comments on TDP: ఎయిడెడ్‌ కాలేజీల ఇష్యూని తెలుగు దేశం పార్టీ రాజకీయం చేయాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయంలో ఎవరైనా సరే దాష్టీకం చేస్తే సహించేది లేదన్నారు.అనంతపురం SSBN కళాశాల వివాదంలో కొన్ని అరాచక శక్తులు దూరాయన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ దీన్ని కూడా ఉద్యమంలా చేయాలని అనుకుంటున్నాడని విమర్శించారు..కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో TDP ఓడిపోవడం ఖాయం. అందుకే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2014-19లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన దౌర్జన్యాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,249 ఎయిడెడ్ సంస్థలు ఉంటే.. 702 సంస్థలు వాళ్లే నడుపుకుంటున్నారు. ఇక్కడ ఏమీ బలవంతం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. 101 సంస్థలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. వారిలో మళ్లీ వెనక్కు అడుగుతున్నారు. టీచర్లు, యాజమాన్యం కలిసి వచ్చిన చోట మాత్రమే తీసుకున్నామన్నారు. ఎయిడెడ్ విషయంలో ఎలాంటి బలవంతం చేయడం లేదన్నారు. టీడీపీ చేస్తున్న అబద్ధపు విష ప్రచారాన్ని నమ్మొద్దన్న సజ్జల.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు సామాజిక న్యాయంతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవర్ని ఎవరు బెదిరించలేరన్న సజ్జల.. కుప్పంలో టీడీపీ ఓడిపోవడం ఖాయం కాబట్టే చంద్రబాబు పెడబొబ్బలు పెడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవం ఏముందో బీజేపీ నేతలు చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రూ.3.20 లక్షల కోట్లు కేంద్రం కోటా కింద వేసుకుంటున్నారు. దాన్ని కూడా రాష్ట్రాలకు వాటా ప్రకారం ఇవ్వాలన్నారు. అప్పుడు కేంద్రం ఎంత తగ్గిస్తే.. దాని ప్రకారం రాష్ట్రాల్లో తగ్గుతుందని సజ్జల పేర్కొన్నారు.

Read Also…  Andhra Pradesh: ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. 30 శాతం సిలబస్‌ కుదింపు..