AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Engineering Fee: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కనీస ఫీజు రూ.43 వేలు: ఏపీ హైకోర్టు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కాలేజీలు మరో 10 శాతం ఫీజు పెంచుకోవడానికి హైకోర్టు వీలు కల్పించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, ఫీజుల నియంత్రణ కమిషన్‌ను కోర్టు..

Engineering Fee: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కనీస ఫీజు రూ.43 వేలు: ఏపీ హైకోర్టు
AP High Court
Srilakshmi C
|

Updated on: Aug 03, 2023 | 3:11 PM

Share

అమరావతి, ఆగస్టు 2: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే అంతకన్నా ఎక్కువ ఫీజులను నిర్ణయించిన కాలేజీలు మరో 10 శాతం ఫీజు పెంచుకోవడానికి హైకోర్టు వీలు కల్పించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ, ఫీజుల నియంత్రణ కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫీజుల ఖరారుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌తోపాటు తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు బుధవారం విచారించింది.

కోర్టు ప్రతిపాదించిన రుసుములపై తమకు అభ్యంతరం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలపడంతో న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులను ప్రభుత్వం సవరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.