AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: సోషల్ మీడియాపై యుద్ధం.. చంద్రబాబు సర్కార్ సరికొత్త వ్యూహం.. ఇకపై అలా చేస్తే..

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం..

Andhra: సోషల్ మీడియాపై యుద్ధం.. చంద్రబాబు సర్కార్ సరికొత్త వ్యూహం.. ఇకపై అలా చేస్తే..
CM Chandrababu
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Oct 01, 2025 | 8:34 PM

Share

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 1, 2025 న ఒక కీలక GO జారీ చేసింది. రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ, బాధ్యత, ఫేక్ వార్తలు, దుర్వినియోగం వంటి అంశాలపై కేంద్రీకృత మంత్రుల కమిటీ ఏర్పాటు చేయడం ఈ GO లక్ష్యం.. ఐటీ, హెల్త్, హోం, హౌసింగ్, ఐ&పీఆర్, సివిల్ సరఫరా మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్, హోమ్, పార్థసారథి, నాదెండ్ల మనోహర్ లు సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

2014–19: సోషల్ మీడియా రాజకీయ తొలి అడుగులు

రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికలను తమ తమ పార్టీ ప్రచారాలకు కేంద్రంగా ఉపయోగించడం ప్రారంభించాయి. తర్వాత క్రమంలో అవి వ్యక్తిగత విమర్శలు, పార్టీ ప్రత్యర్ధులపై తప్పుడు సమాచారం, వ్యక్తిగత దూషణలు మొదలై, ఫ్రీ స్పీచ్ vs నియంత్రణ మధ్య అస్పష్టతల సమస్యగా మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా లో లేనంతగా సోషల్ మీడియా వేదికలపై కొంతమంది దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి.

తదుపరి దశలో…

తర్వాత కాలంలో సోషల్ మీడియా ప్రభావం కొత్త ఉత్సాహం పొందింది. రాజకీయ ప్రత్యర్ధుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాటు పలు వివాదాస్పద వ్యవహారాలకు సోషల్ మీడియా వేదికైంది. చివరకు కేసులు నమోదు, HC గ్యాగ్ ఆదేశాలు, జడ్జిలపైనా ఆరోపణలు, దర్యాప్తులు ఇలా అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా వేలాదిగా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకోవడమే కాకుండా డిజిటల్ మీడియా లాంటి కొన్ని ప్రభుత్వ సంస్థలను కూడా ప్రభుత్వేతర అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.

తాజాగా సోషల్ మీడియా పై ప్రభుత్వం యుద్ధం

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చాక, సోషల్ మీడియా పై అవగాహన పెంచే కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఒకవైపు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఒక కంట కనిపెడుతూనే దీని నియంత్రణను తాజాగా మరింత కఠినంగా చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం Social Media Abuse నియంత్రణ బిల్స్‌ను ప్రతిపాదిస్తోంది.

GO ఎందుకంటే..

1. అస్పష్టత నివారించడానికి స్పష్టమైన మంత్రి వర్గ కమిటీ అవసరం అని భావించి GoM ను ప్రకటించింది ప్రభుత్వం

2. బాధ్యతలు, ఫిర్యాదు, నివేదిక వ్యవస్థతో అకౌంటబిలిటీ & పారదర్శకత

3. ఫేక్ వార్తలు, మిస్ఇన్ఫర్మేషన్, దుర్వినియోగంపై నియంత్రణ.

4. స్వతంత్ర పర్యవేక్షణ ఏజెన్సీలు, నోడల్ ఏజెన్సీ ల ఏర్పాటుకు సూచనలు.

వీలైనంత త్వరగా ఈ మంత్రుల బృందం ప్రపంచంలోనే ఇతర దేశాలు, రాష్ట్రాలు అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ ని పరిశీలించి సోషల్ మీడియా నియంత్రణపై కొత్త చట్టాలను అమలులోకి తీసుకురావాలన్నది ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియా దుర్వినియోగం.. తప్పుడు కథనాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..