Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ కష్టాలు తీరినట్లే..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇకపై రేషన్ బియ్యం ఇచ్చేందుకు స్మార్ట్ ఈ-పోస్ మిషన్లు అందించనున్నారు. మారుతున్న ట్రెండ్ టెక్నాలజీకి అనుగుణంగా మరింత వేగంగా సులభతరంగా ప్రజలకు రేషన్ తోపాటు నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ కష్టాలు తీరినట్లే..!
Smart E Pos Machines
Vasanth Kollimarla
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 21, 2025 | 10:59 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం ఇకపై స్మార్ట్ గా జరగనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో ఇకపై రేషన్ బియ్యం ఇచ్చేందుకు స్మార్ట్ ఈ-పోస్ మిషన్లు అందించనున్నారు. మారుతున్న ట్రెండ్ టెక్నాలజీకి అనుగుణంగా మరింత వేగంగా సులభతరంగా ప్రజలకు రేషన్ తోపాటు నిత్యావసర సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది.

రేషన్ పంపిణీకి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్న ప్రభుత్వం స్మార్ట్ ఈ-పోస్ మిషన్లు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యాన్ని అందించాలని అంటే అనాదిగా ఉపయోగిస్తున్న కీ ప్యాడ్ తో కూడిన మిషన్ల ద్వారా రేషన్ ఇస్తున్నారు. వాటి స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీ, టచ్ స్క్రీన్, నెట్‌వర్క్ ఇష్యూ లేకుండా అందించేందుకు స్మార్ట్ మిషన్లు అందుబాటులోకి తెచ్చింది. ఇన్ బిల్ట్ సిమ్ కార్డ్ తోపాటు నెట్‌వర్క్ ఇష్యూ ఏర్పడినా కూడా వైఫై, హాట్ స్పాట్ ద్వారా పని చేసేలా స్మార్ట్ ఈ-పోస్ మిషన్‌ను తీర్చిదిద్దారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేసే స్మార్ట్ మిషన్‌లో బయోమెట్రిక్, స్వైపింగ్, ఐరిస్‌ను అందుబాటులోకి తెచ్చారు. రేషన్ పంపిణీ చేసేందుకు బయో మెట్రిక్ పని చేయకపోతే ఐరిస్ ద్వారా కార్డ్ ఎంట్రీ చేస్తారు. ఐరిస్ వర్క్ అవ్వకపోతే ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్న నేపథ్యంలో వాటి ద్వారా స్వైప్ చేసి కార్డుదారులకు సరుకులు ఇవ్వనున్నారు రేషన్ డీలర్లు.

స్మార్ట్ ఈ-పోస్ మిషన్లను ప్రస్తుతం కృష్ణా జిల్లాలో రేషన్ డీలర్లకు పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసింది. వీటి వినియోగంపై కృష్ణా జిల్లాలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మిగతా జిల్లాల్లోనూ స్మార్ట్ మిషన్లను ప్రభుత్వం అమలు చేయనుంది. మారుమూల ప్రాంతాల్లో రేషన్ ఇవ్వాలంటే వస్తున్న ఇబ్బందులు ఏర్పడుతున్న సర్వర్ సమస్యలకు చెక్ పెట్టేలా, ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తుంది. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..