అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టిన యువతులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!
ఇళ్లలో పనుల కోసం లేదా బాగోగులు చూసేందుకు ఎవరైనా కొత్తవారిని నియమించుకుంటే మాత్రం వారి గత చరిత్ర తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని తెలియకుండా తీసుకువచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్ధని హెచ్చరిస్తున్నారు. నేరాలకు రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలకు కావడంతో ఇకపై రెండు ఉదంతాలు చూసైనా కళ్ళుతెరవాలని పోలీసులు సూచిస్తున్నారు.

కేర్ టేకర్లుగా పని చేస్తున్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని విజయవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ నగరంలో రోజుకో ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేర్ టేకర్ల విషయంలో ఈ విషయాన్ని సిరియస్‌గా తీసుకోవాలని నగర వాసులను సూచిస్తున్నారు. తాజాగా నమోదైన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు బయటపడ్డాయి
ఇటీవల విజయవాడ నగరంలో కేర్ టేకర్ కల్చర్ బాగా పెరిగింది. ఇంట్లో వయస్సు మీద పడిన పెద్దవాళ్ల బాగోగులు చూసుకునేందుకు కేర్ టేకర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే కేర్ టేకర్ల గత చరిత్ర తెలుసుకోకుండా నియమించుకోవడంతో అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇటీవల రెండు ఘటనలు వెలుగులోకి రావడంతో కేర్ టేకర్లను నియమించుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కొద్దీ రోజుల క్రితం విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ రామారావును కేర్ టేకర్ అనూష, ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హత్య చేశారు. రామారావు తల్లి సరస్వతికి కేర్ టేకర్‌గా చేరిన అనూష.. రామారావు నివాసంలో డబ్బు కోసం దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అనూష ఎవ్వరో తెలుసుకోకుండా నియమించుకోవడంతో కేర్ టేకర్ అనూష చేతిలో రామారావు దారుణ హత్యకు గురయ్యాడు.
తాజాగా ఇదే తరహాలోనే తేజశ్రీ అనే యువతి అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది. పటమట స్టేషన్ పరిధిలో అడుసుమిల్లి శివలీల నివాసంలో కేర్ టేకర్‌గా తేజశ్రీనీ నియమించుకోగా, ఇంట్లో నమ్మకంగా ఉంటూనే బంగారు ఆభరణాలను దొంగతనం చేసింది. డైమండ్ గాజులు, బంగారు గాజులు దొంగతనం చేసి.. ఏమి తెలియనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇంట్లో అందరు ఉన్నా.. అభరణాలు పోవడంతో పోలీసులను ఆశ్రయించారు శివలీల దంపతులు. పోలీసుల విచారణలో కేర్ టేకర్ తేజశ్రీ దొంగతనానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
ఇళ్లలో పనుల కోసం లేదా బాగోగులు చూసేందుకు ఎవరైనా కొత్తవారిని నియమించుకుంటే మాత్రం వారి గత చరిత్ర తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వారిని తెలియకుండా తీసుకువచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్ధని హెచ్చరిస్తున్నారు. నేరాలకు రెండు ఘటనల్లో ఇద్దరు మహిళలకు కావడంతో ఇకపై రెండు ఉదంతాలు చూసైనా కళ్ళుతెరవాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
