AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: లేడీ డాన్ అరుణ మామూల్ది కాదు.. చెప్పిన రేటుకే ఫ్లాట్ ఇవ్వాలంటూ మెడపై కత్తి పెట్టి మరీ..

వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి, చిన్నాచితకా మోసాలు చేస్తూ రెండేరెండేళ్లలో హై ప్రొఫైల్ లేడీ డాన్‌గా మారిన నిడిగుంట అరుణ అరాచకాల కథ క్లయిమాక్స్‌కు చేరింది. రౌడీషీటర్ శ్రీకాంత్‌ను భర్తగా చెప్పుకుంటూ, ఆయన పెరోల్ కోసం పోలీస్, పొలిటికల్ వ్యవస్థల్నే మేనేజ్ చేసినట్టు ఆమెపై అభియోగాలున్నాయి.

Andhra: లేడీ డాన్ అరుణ మామూల్ది కాదు.. చెప్పిన రేటుకే ఫ్లాట్ ఇవ్వాలంటూ మెడపై కత్తి పెట్టి మరీ..
Nellore Nidigunta Aruna
Shaik Madar Saheb
|

Updated on: Aug 21, 2025 | 11:31 AM

Share

నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్‌ నిడిగుంట అరుణ కథ ఇప్పుడు కటకటాల వెనక్కు చేరింది. రౌడీషీటర్‌కు పెరోల్ ఇప్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ.. రిమాండ్‌ ఖైదీగా సెటిలైంది. అటు, అరుణ కేసు దర్యాప్తు కొనసాగితే మరికొంతమంది బుక్కవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వెలుగు కార్యాలయంలో చిన్న ఉద్యోగిగా చేరి, చిన్నాచితకా మోసాలు చేస్తూ రెండేరెండేళ్లలో హై ప్రొఫైల్ లేడీ డాన్‌గా మారిన నిడిగుంట అరుణ అరాచకాల కథ క్లయిమాక్స్‌కు చేరింది. రౌడీషీటర్ శ్రీకాంత్‌ను భర్తగా చెప్పుకుంటూ, ఆయన పెరోల్ కోసం పోలీస్, పొలిటికల్ వ్యవస్థల్నే మేనేజ్ చేసినట్టు ఆమెపై అభియోగాలున్నాయి. హోంమంత్రి అనిత స్పందించడంతో అరుణపై యాక్షన్ ప్లాన్ షురూ అయింది.

ఫ్లాట్ అక్రమ రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించి, బెదిరించిందంటూ ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరుణను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు కోవూరు పోలీసులు.. కారు డిక్కీలో దాక్కుని పారిపోతుండగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టగా.. 14 రోజుల రిమాండ్ విధించింది.. వచ్చేనెల 4 వరకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు పోలీసులు..

అపార్ట్‌మెంట్ యజమానితో ఫ్లాట్ కొనేందుకు రూ.28 లక్షల బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మాత్రమే చెల్లించిన అరుణ.. మిగతా డబ్బులు చెల్లించకుండా అతన్ని బెదిరించింది. 2024లో కొంతమంది వ్యక్తులతో కలిసి యజమానిని బెదిరించి.. మెడపై కత్తి పెట్టి తనపేరు మీదకి ఫ్లాట్ మార్చాలని బెదిరింపులకు పాల్పడిందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. దీంతో అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇదిలాఉంటే.. గత వారం నెల్లూరు జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న.. రౌడీషీటర్ శ్రీకాంత్ కు పెరోల్ లభించింది. అయితే.. దీనికోసం నిడిగుంట అరుణ పెద్ద ఎత్తున లాబియింగ్ చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి.. అంతేకాకుండా.. ఆమె ఆసుపత్రిలో ఉన్న శ్రీకాంత్ ను కలిసిన వీడియోలు కూడా వైరల్ కావడం మరింత చర్చకు దారితీసింది.

ఇది కూడా చదవండి..

Andhra: ఖైదీతో మహిళ సరసాలు.. ఏకంగా ఆస్పత్రిలోనే.. సంచలనం రేపుతున్న వీడియోలు

ఇదిలాఉంటే.. శ్రీకాంత్ పెరోల్ విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని, అరెస్టయిన అరుణ టీడీపీకి చెందిన కార్యకర్తేనని వాదిస్తోంది వైసీపీ.. టీడీపీ MLAలు చేసిన తప్పుల్ని వైసీపీపైకి నెట్టడమేంటని ప్రశ్నిస్తోంది. కానీ, అరుణ విషయంలో తమపై వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. వైసీపీ నేతలతోనే ఆమెకు సంబంధాలున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..