దసరా ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉత్సవాలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. అమ్మవారి మండపాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఖచ్చితంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు.
మరో రెండు రోజుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శరన్నవరాత్రులు జరగనుండగా.. ఈ మహోత్సవాలకు విచ్చేసే భక్తులందరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. భక్తులకు ఇబ్బంది రాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. భక్తుల కోసం అత్యవసర వైద్య సదుపాయాలను సిద్దం చేశామన్నారు. అటు గత ఏడాది జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని కొండచరియలు జారకుండా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
ఇదిలా ఉంటే దసరా ఉత్సవాలకు భారీగా పోలీసులు మొహరించనున్నారు. దూరం నుంచే వచ్చే భక్తులకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలను కేటాయించడమే కాకుండా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు రోజుకు 10 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, కోవిడ్ నేపధ్యంలో పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వారికి అనుమతులు లేవని విజయవాడ కమిషనర్ బత్తిని శ్రీనివాసులు వెల్లడించారు.
Also Read:
‘ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్’.. నాగచైతన్య ట్వీట్.!
విడాకుల ప్రకటన తర్వాత సమంతా తొలి పోస్టు.. వైరల్గా మారిన ఇన్స్టా స్టేటస్..
నాగుపాముకు చుక్కలు చూపించిన ఉడుత.. పోరు మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు!