Andhra Pradesh: అదంతా పచ్చి అబద్ధం.. వైసీపీ ఎమ్మెల్యేపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం. అసలేం జరిగిందంటే..
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. ప్రపంచంలో ఏ మూలన జరిగిన విషయమైన క్షణాల్లో అరచేతిలో వాలిపోతోంది. అయితే ఈ సమాచారం అంతా నిజమైందేనా అంటే కచ్చితంగా అవుననే...
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచార మార్పిడిలో వేగం పెరిగింది. ప్రపంచంలో ఏ మూలన జరిగిన విషయమైన క్షణాల్లో అరచేతిలో వాలిపోతోంది. అయితే ఈ సమాచారం అంతా నిజమైందేనా అంటే కచ్చితంగా అవుననే సమాధానం మాత్రం చెప్పని పరిస్థితి నెలకొంది. ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొందరిని టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డికి సంబంధించిన ఓ తప్పుడు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
వైసీపీ నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర రెడ్డిని గురజాల నియోజకర్గంలో ప్రజలు రోడ్లు బాగా లేవని ప్రశించారని. దీనికి ప్రతిగా వైసీపీ కార్యకర్తలు ఇంటికి దాడికి దిగారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఇంతటీ ఆగకుండా ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. సదరు వీడియోలో కొందరు వ్యక్తులు ఇంటిపై దాడికి దిగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోకు సంబంధించిన అసలు విషయాలను పంచుకున్నారు.
#FactCheck The video is from Gudur, Tirupati, where a 20 year old student of a private engineering college committed suicide. Later the parents alleged that their son died due to the pressure from management and vandalized the college properties.
Link: https://t.co/SuHY4rt8wI https://t.co/yHQ2GU94ov pic.twitter.com/B9ZfVToHsd
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 6, 2023
ఈ సంఘటనకు వైసీపీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని ఫ్యాక్ట్‌చెక్.ఏపీ.ఇన్ ట్విట్టర్ హాండిల్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. సదరు వీడియోలోని సంఘటనలో తిరుపతిలోని గూడురులో జరిగినట్లు తెలిపారు. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోన్న 20 ఏళ్ల విద్యార్థి.. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితో మరణించాడని పేరెంట్స్ ఆరోపించారు. అనంతరం కాలేజీ ఆస్తులను ధ్వంసం చేశారని, ఎప్పుడో జరిగిన వీడియోను ఇలా తప్పుడు ప్రచారంతో వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టినట్లైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..