Pawan Kalyan: చంపేస్తాం.. పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్.. డీజీపీతో మాట్లాడిన హోంమంత్రి అనిత..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది.. ఉప ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం.. అభ్యంతరకర భాషతో సందేశాలు పంపించడం కలకలం రేపింది..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది.. ఉప ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ఫోన్ చేయడం.. అభ్యంతరకర భాషతో సందేశాలు పంపించడం కలకలం రేపింది.. దీంతో వెంటనే డిప్యూటీ సీఎం పేషీ సిబ్బంది.. బెదిరింపు కాల్స్, అసభ్యకరమైన సందేశాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిప్యూటీ సీఎం.. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు పెట్టిన నిందితుడి కోసం స్పెషల్ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టారు..
కాగా.. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంపై హోంశాఖ మంత్రి అనిత ఆరా తీశారు.. తనకు కూడా గతంలో బెదిరింపు కాల్స్ రావడం.. తాజాగా.. డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన బెదిరింపు కాల్స్, మెసేజ్ ల గురించి డీజీపీ ద్వారకా తిరుమలరావుతో చర్చించారు.. డిప్యూటీ సీఎంపేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని.. హోంమంత్రి అనితకు డిజీపీ వివరించారు..
అయితే.. తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని హోంమంత్రి అనిత తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఇచ్చిన వివరాల మేరకు తన కాల్స్ హిస్టరీలో ఆ నంబర్ ను గమనించిన హోంమంత్రి అనిత.. డిప్యూటీ సీఎం పేషీకి వచ్చిన నంబర్ల నుంచే తన మొబైల్‌కూ గతంలో కాల్స్ వచ్చాయని నిర్ధారించుకున్నారు.. గతంలోనూ ఆ నంబర్ల నుంచి ఫోన్ లు వచ్చిన కాల్ హిస్టరీ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఆకతాయిలెవరో వెతికి పట్టుకోవాలని డీజీపీకి హోంమంత్రి అనిత ఆదేశాలిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..