AP Exams: ఏపీ పది, ఇంటర్ పరీక్షలు జులైలోనే.. ఏర్పాట్లు చేస్తున్న విద్యా శాఖ..
Exam Arrangements: జులైలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పిన AP సర్కార్... అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది. జులై మొదటి వారంలో...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుండటంతో జులైలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పిన AP సర్కార్… అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది. జులై మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు.. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని విద్యాశాఖ అంటోంది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా కారణంగా పరీక్షలు రాయలేకపోతే మళ్ళీ సప్లిమెంటరీ పెట్టేందుకు కూడా సిద్దంగా ఉంది. వారి సప్లిమెంటరీ పరీక్షలను ర్యాగులర్ ఎగ్జామ్ కింద భావించి సర్టిఫికెట్ ఇస్తామని ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే విద్యార్థులకు ముందస్తుగా కనీసం 15 రోజుల వ్యవధి ఇవ్వాలనే ప్రభుత్వం ఆలోచిస్తోంది.
జులైలో పరీక్షలు పూర్తి చేసి.. ఆగస్టు నాటికి ఫలితాలు వెల్లడించేలా ప్లాన్ చేస్తోంది. దీంతో సెప్టెంబర్‌లో నిర్వహించే జాతీయ పోటీ పరీక్షలకు విద్యార్థులు రెడీ అయ్యేందుకు అవకాశం ఉంటుందని విద్యా శాఖ భావిస్తోంది. ఒకవేళ జులైలో పరిక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే… ఇక రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఇదిలావుంటే… ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికిపై విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందుగానే షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జూన్ 20 వరకు కరోనా కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే. జులైలో ఇంటర్ పరీక్షలు పూర్తయితే, ఆగస్టులో ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ, ఇతర ఉమ్మడి పోటీ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.