Flash News: ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్..

AP Curfew News: కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో రేపట్నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది...

Flash News: ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్..
Follow us

|

Updated on: May 04, 2021 | 4:12 PM

AP Curfew News: కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో రేపట్నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. దీనిపై తాజాగా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, వ్యాపారాలకు అనుమతించింది.

ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి ప్రజా రవాణా వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అటు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దూరప్రాంత బస్సు సర్వీసులు సైతం నిలిచిపోనున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు కూడా ఇదే విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అటు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి వచ్చేవారికి కరోనా టెస్ట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. విదేశాల నుంచి వచ్చేవారికి ఎయిర్ పోర్టులలో టెస్టులు చేయనుండగా.. నెగటివ్ వచ్చినవారిని ఇంటికి.. పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించనున్నారు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి కూడా టెస్టులు తప్పనిసరి చేశారు. అందుకోసం సరిహద్దుల్లో కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

ఇక కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది.

Also Read:

Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?

Viral: ల్యాండింగ్‌కు 20 నిమిషాల ముందు విమానం అదృశ్యం.. అంతుచిక్కని రహస్యం.. కట్ చేస్తే.!

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..