Thunderstorm Warning: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..

Thunderstorm Warning: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు,

Thunderstorm Warning: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ రెండు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..
thunderstorm in telangana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 04, 2021 | 4:04 PM

Thunderstorm Warning: ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు, జీవాల కాపర్లు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దంటూ విపత్తుల శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశముందని ఏపీ విపత్తుల శాఖ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా మందస, పలాస, మేలియపుట్టి, రాజాం మండలాల్లో, అదేవిధంగా.. విజయనగరం జిల్లా గుర్ల, గజపతినగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదంటూ సూచించింది. ఈ మేరకు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల శాక కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. సాధ్యమైనంత వరకు జనాలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు.

పిడుగుపాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

• ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి. • సముద్రము, కొలనులు, సరస్సులు మరియు చెరువులు దగ్గర ఉంటే, వెంటనే దూరంగా వెళ్ళాలి. రేకు, లోహము కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. • ఉరుముల శబ్దం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశుకాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. కారు / బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి. • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఉన్నప్పుడు మీ మెడ వెనుక జుట్టు నిక్కబొడవటం లేదా చర్మం జలదరింపు ఉంటే మెరుపు,పిడుగు రావడానికి సూచనగా భావించండి. • బహిరంగ ప్రదేశాల్లో ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోండి . దీని వలన ఉరుములు , మెరుపుల నుండి రక్షణ పొందే అవకాశం ఉంటుంది. • ఇంట్లో ఉన్నట్లయితే కిటికీలు, తలుపులు మూసివేయండి. ఉరుముల శబ్దం ఆగిపోయిన తరువాత కుడా 30 నిమిషాల వరకు ఇంట్లోనే ఉండి రక్షణ పొందండి. • పిడుగు భాదితులను తాకవచ్చు. సత్వరమే వారికి సహాయం అందించండి. • పిడుగు భాదితుడిని వెంటనే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.

పిడుగుపాటు సమయంలో చేయకూడనివి..

• ఉరుములు,మెరుపులు సంభవించినపుడు చెట్ల క్రింద , చెట్ల సమీపంలో , టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు. • ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్ వస్తువులు , ఇతర పరికరాలు చార్జ్డ్ ఫోన్లు/మొబైల్స్ వినియోగించరాదు. • పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండటం లాంటివి చేయరాదు. • మోటారుసైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్థంబాలకు మరియు ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. • వాహనంలో ఉండి ఉంటే లోహపు భాగాలను తాకరాదు.

Also Read:

Road Accident: నెల్లూరులో విషాదం.. పనికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు కూలీల దుర్మరణం..

మెక్సికో సిటీలో రోడ్డుపై పడిన మెట్రో ట్రెయిన్, 15 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.