AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court: ఏపీలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ముగిసిన విచారణ.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది.

AP High Court: ఏపీలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ముగిసిన విచారణ.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం
Ap High Court
Balaraju Goud
|

Updated on: May 04, 2021 | 3:28 PM

Share

AP Parisath Counting of Votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఓట్ల లెక్కింపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

గతంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సింగిల్‌ జడ్జి విచారణ జరిపి ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. దీనిపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది. దీనిపై విచారణ జరిపిన అనంతరం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. తాజాగా విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇదిలావుంటే, ఏఫ్రిల్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు జరలేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించింది. మొత్తం 2,058 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక, మొత్తం 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం18,782 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 652 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి.

Read Also.. సినీ పరిశ్రమలో కరోనా కల్లోలం.. కోవిడ్‏తో ప్రముఖ హీరోయిన్ సోదరుడు, నిర్మాత భార్య మృతి.. వెంటిలేటర్‌, బెడ్‌ కోసం ప్రయత్నిస్తుండగానే..