AP Corona Cases: గుడ్ న్యూస్.. ఏపీలో కరోనా తీవ్రత తగ్గుముఖం.. 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధించిన కర్ఫ్యూ వైరస్ వ్యాప్తిని..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధించిన కర్ఫ్యూ వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకొస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 91,849 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 4458 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,71,475కి చేరింది. ఇందులో 47,790 యాక్టివ్ కేసులు ఉండగా.. 18,11,157 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 38 మంది ప్రాణాలు విడిచారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 12,528కు చేరుకుంది.
ఇక గడిచిన 24 గంటల్లో 6313 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 2,15,41,486 సాంపిల్స్‌ను పరీక్షించారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 224, చిత్తూరు 708, తూర్పుగోదావరి 909, గుంటూరు 239, కడప 370, కృష్ణా 331, కర్నూలు 126, నెల్లూరు 212, ప్రకాశం 335, శ్రీకాకుళం 151, విశాఖపట్నం 198, విజయనగరం 64, పశ్చిమ గోదావరి 591 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
కాగా, రాష్ట్రంలో 50 వేల దిగువకు యాక్టివ్ కేసులు తగ్గాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. తాజాగా ఆయన కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందన్న ఆయన.. 6 జిల్లాల్లో(కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు) జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా రికవరీ రేటు ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.59 శాతంగా ఉంటే.. ఏపీలో 96. 67 శాతంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్యుపై అయిన పడకల్లో 76.51 శాతం పడకల్లో రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్నామన్నారు. అటు 104కు గణనీయంగా కాల్స్ రావడం తగ్గాయని.. జూన్ 25న కేవలం 1021 కాల్స్ మాత్రమే వచ్చాయన్నారు.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!
#COVIDUpdates: 25/06/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,68,580 పాజిటివ్ కేసు లకు గాను *18,08,262 మంది డిశ్చార్జ్ కాగా *12,528 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 47,790#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HW8bPRVtxq
— ArogyaAndhra (@ArogyaAndhra) June 25, 2021
