AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: నిరుపేదల చిరకాల కోరికను నెరవేరుస్తాం.. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష..

పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద అమరావతిలో ప్రభుత్వం ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వనుంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల దీనితో సాకారం కానుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల కోరికను నెరవేర్చే బృహత్తర కార్యక్రమంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

YS Jagan: నిరుపేదల చిరకాల కోరికను నెరవేరుస్తాం.. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష..
Andhra CM Jagan Reddy
Shaik Madar Saheb
|

Updated on: May 11, 2023 | 6:08 PM

Share

పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద అమరావతిలో ప్రభుత్వం ఉచితంగా ఇళ్లపట్టాలు ఇవ్వనుంది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదల సొంతింటి కల దీనితో సాకారం కానుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల కోరికను నెరవేర్చే బృహత్తర కార్యక్రమంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేలమంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్ కు అధికారులు వివరించారు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొత్తం 21 లే అవుట్లలో పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనుంది. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లే అవుట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు అందించనుంది.ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని, జంగిల్‌ క్లియరెన్స్, ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు ముగిశాయని అధికారులు వెల్లడించారు. దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్‌ రోడ్లు వేసే పనులుకూడా చేపడుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హైకోర్టుకు అదనపు భవనం నిర్మాణం కూడా పూర్తవుతోందని అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. 76,300 చదరపు అడుగులు విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన కూడా జరుగుతోందని అధికారులు వివరించారు. సీఐటీఐఐఎస్‌ కార్యక్రమం కింద చేపడుతున్న పనులనూ వివరించిన అధికారులు.. దాదాపు 12 అర్భన్‌ ప్రాంతాల్లో ఈ పనులు చేపడుతున్నామని వివరించారు.

టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష..

టిడ్కో ఇళ్లలో ఫేజ్‌ –1 కు సంబంధించి 1,50,000 ఇళ్లలో ఇప్పటికే 1.39 లక్షలు పూర్తయ్యాయని.. 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లు అప్పగించామని అధికారులు వెల్లడించారు. జూన్‌ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. రెండో విడతకు సంబంధించిన 1,12,092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నామని.. జూన్‌ మొదటి వారంలో సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవం జరగుతుందని తెలిపారు.

విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. దీనికి అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలతీ.. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సీఎం సూచించారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ద్వారా ఏర్పడ్డ రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. రివర్‌ బెడ్‌పై వాకింగ్‌ ట్రాక్‌ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్‌ పనులను సీఎంకు అధికారులు వివరించగా.. విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దాలని సూచించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..