CM Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇవాళే తల్లుల ఖాతాల్లోకి ‘అమ్మ ఒడి’ డబ్బులు.. పూర్తి వివరాలివే
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులను ఇవాళ (జూన్ 28) రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం. పిల్లలను చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తోంది. ఈ పథకం కింద 15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 3 సార్లు నిధులను రిలీజ్ చేసిన సర్కార్..2022-23 విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మఒడి.. బతుకులు మార్చే గుడిగా సర్కార్ చెబుతోంది.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులను ఇవాళ (జూన్ 28) రిలీజ్ చేస్తోంది ప్రభుత్వం. పిల్లలను చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తోంది. ఈ పథకం కింద 15వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే 3 సార్లు నిధులను రిలీజ్ చేసిన సర్కార్..2022-23 విద్యా సంవత్సరానికి జగనన్న అమ్మఒడి.. బతుకులు మార్చే గుడిగా సర్కార్ చెబుతోంది. ఇందులో భాగంగాఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇవాళ పార్వతీపురం మన్యంజిల్లా కురుపాంలో పర్యటిస్తారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కాలేజ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం కురుపాంలోని బహిరంగ సభ వేదిక వద్దకు రోడ్డు మార్గంలో వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మఒడి పథకం నిధులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. వరుసగా 10 రోజులు పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
డ్రాప్ అవుట్స్‌ను కట్టడి చేసేందుకు..
కాగా పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి యేటా 15వేల ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం నాలుగు విడతల్లో ఇప్పటివరకూ రూ. 26,067.28 కోట్లు అందించారు. పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పారదర్శకంగా, లంచాలకు వివక్షకు తావులేకుండా ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు పని చేస్తోంది. పేద విద్యార్థులు చదువుకునేలా , పాఠశాలలో డ్రాప్ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి కనీసం అటెండెన్స్ ఉండేలా నిబంధన అమలు చేస్తున్నారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75% హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
100.8 శాతానికి..
గత నాలుగేళ్లలో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల 84.48 శాతంగా ఉన్న జీఈఆర్ 100.8 శాతానికి చేరిందని అంటున్నారు. విద్యార్థుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. స్కూల్, కాలేజీ విద్యార్థుల కోసం ఆల్రెడీ అమ్మఒడి, విద్యాదీవెన వంటి కొన్ని పథకాలను అమలుచేస్తోంది. అలాగే.. నాడు-నేడు ద్వారా స్కూళ్లను సరికొత్తగా తీర్చిదిద్దుతోంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
