AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇకపై విద్యార్థులు స్కూల్‌కి వెళ్లకపోతే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక పేర్లతో ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక వీటి అమలు విషయంలోనూ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది...

Andhra Pradesh: ఇకపై విద్యార్థులు స్కూల్‌కి వెళ్లకపోతే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
Andhra Schools
Narender Vaitla
|

Updated on: Apr 10, 2023 | 5:48 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నాడు-నేడు, అమ్మ ఒడి, విద్యా కానుక పేర్లతో ఇప్పటికే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక వీటి అమలు విషయంలోనూ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా విద్యాశాఖపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్‌ ఉండాలని జగన్‌ సూచించారు.

పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నామన్న సీఎం.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్తుందని తెలిపారు. విద్యార్థులకు ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు ముఖ్యమంత్రి. అంతే కాకుండా వచ్చే ఏడాది విద్యాకానుకపై కూడా సమీక్షించారు. విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్కూల్‌ పిల్లలకు టోఫెల్‌ సర్టిఫికేట్‌ పరీక్షలపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా.. విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై అధికారులు సీఎంకు వివరించారు. ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us