AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంటి బయట నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్..

అది ఒక ప్రశాంతమైన సాయంత్రం.. సర్పంచ్ ఇంట్లో అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది సేద తీరుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో వింత శబ్దాలు.. ఏదో తెలియని అలజడి.. ఏంటా అని వెళ్లి చూసిన ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. కళ్లముందు సాక్షాత్తు యమధర్మరాజులా బుసలు కొడుతూ 12 అడుగుల భారీ గిరినాగు తిష్ట వేసింది.

Andhra Pradesh: ఇంటి బయట నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
King Cobra Found In Anakapalli
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 7:02 AM

Share

అనకాపల్లి జిల్లాలో ఓ గ్రామం. అది సర్పంచ్ ఇల్లు.. కుటుంబమంతా ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కొంతమంది సేద తీరుతూ ఉన్నారు. ఇంతలో అనుకోని అతిధి ఇంట్లోకి వచ్చింది. ఇంటి పరిసరాల్లో సంచరిస్తూ ఉంది. ఇంట్లోవాళ్లకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేని ఆ శబ్దాలతోఒక్కసారిగా ఉలికిపాటు అనుమానం వచ్చి చూస్తే.. గుండె పట్టుకునే సీన్ కళ్ల ముందు కనిపించింది. ఇక అంతే భయంతో పరుగులు తీశారు. వనంలో ఉండాల్సిన జీవులు ఇప్పుడు చాలా చోట్ల జనాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆహారం కోసం, లేక ఇతర కారణమేమో గాని జనావాసాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అటువంటి వాటితో ప్రమాదాలు కూడా పొంచి ఉంటున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలోని ఓ సర్పంచ్ ఇంట్లో భారీ గిరి నాగు కలకలం రేపింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల పొడవుంది. దీంతో ఆ కుటుంబమంతా గుండెలు పట్టుకునే పని అయింది.

వి.మాడుగుల మండలం ద్వారకానగర్‌లో భారీ గిరినాగు బుసలు కొట్టింది. గ్రామ ​సర్పంచ్ నాయుడు ఇంటి పరిసరాల్లో సంచరించింది కింగ్ కోబ్రా. ఇంట్లోకి చొరబడి శబ్దాలు చేసింది. ఏంటా అని చూసేసరికి ​12 అడుగుల భారీ గిరి నాగు కళ్ల ముందు కనిపించింది. కింగ్ కోబ్రాను చూసిన సర్పంచ్ కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీసారు. ఈ సమాచారాన్ని స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు అందించారు. రంగంలోకి దిగిన వెంకటేష్.. రెండు గంటల పాటు శ్రమించి పామును సురక్షితంగా రెస్కు చేశాడు. బంధించే క్రమంలో ఆ పాము అతడికే చుక్కలు చూపించింది. ఎట్టకేలకు ఆ కింగ్ కోబ్రాను పట్టుకుని ​అటవీ శాఖ అధికారుల సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
వారెవ్వా.. ఏసీ నుంచి వచ్చే వేస్ట్‌ వాటర్‌తో ఇన్ని లాభాలా..?
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
అమావాస్య పేరు వెనుక రహస్యం ఏమిటి? పితృదేవతలతో ఉన్న సంబంధం..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
ప్రకృతి ప్రసాదించిన వరం.. దీంతో పచ్చడి చేసుకోని తింటే..
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
అన్నదమ్ముల మధ్య వార్.. మధ్యలో దూరిన సిస్టర్.. వైరల్ అవుతున్న ఫోటో
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
వారెవ్వా.. 90 కి.మీ మైలేజ్‌తో సుజుకి నుంచి సూపర్ స్కూటీ..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే
పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే