AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో మెట్రో‎కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ క్యాబినెట్..

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‎కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖలో నాలుగు కారిడార్‎లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తోన్న ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాల్లో మెట్రో‎కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ క్యాబినెట్..
Visakhapatnam Metro Rail
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Dec 16, 2023 | 7:29 AM

Share

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‎కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. దీని ప్రకారం విశాఖలో నాలుగు కారిడార్‎లలో మెట్రో నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామంటూ చెబుతూ వస్తోన్న ప్రభుత్వం విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. పెరుగుతున్న జనాభా, పెరగనున్న అవసరాల నేపథ్యంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు వేగంగా ముందుకు వెళ్తోంది. దీంతో తాజాగా ఆమోదించిన డీపీఅర్‎లో అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

డీపీఅర్ ప్రకారం విశాఖలో మెట్రో రైల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా మెట్రో పిల్లర్లు నిర్మాణం చేపట్టే దిశగా పొందుపరచినట్టు సమాచారం. దీని ప్రకారం తొలి విడతలో 76.90 కిలో మీటర్ల మేర లైట్‌ మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. నిధుల సమీకరణను వేగవంతం చేయాలని కూడా కేబినెట్ మెట్రో యాజమాన్యానికి సూచించడం విశేషం. తాజాగా పెరిగిన అంచనాల ప్రకారం విశాఖ మహానగరంలో 27 లక్షలకు పైగా జనాభా ఉండే అవకాశం ఉంది. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న శివారు ప్రాంతాలతో కలిపితే మొత్తం జనాభా 41 లక్షలుగా ఉంది. ఇక్కడే వయబిలిటీ‎కి ఇబ్బంది ఉండదన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.

జనవరి 15 న శంకుస్థాపన

కేవలం డీపీఅర్‎ను ఆమోదించడమే కాకుండా వచ్చే ఏడాది జనవరి 15న మెట్రో రైలు పనులకు శంకుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది. అదే సమయంలో శంకుస్థాపన చేసే లోపు నిధుల సేకరణ కు అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా కేబినెట్‎లో చర్చ జరిగింది. అందుకు ఉన్న మార్గాల్ని అన్వేషించాలని ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ యూజేఎం రావుకు సైతం కేబినెట్ డైరెక్ట్ చేయడమే కాకుండా పలు సూచనలు కూడా చేసిందట.

ఇవి కూడా చదవండి

నాలుగు కారిడార్లు, 54 స్టేషన్ లు

  • మొత్తం 42 మెట్రో స్టేషన్లతో కూడిన మూడు కారిడార్లను మొదటి దశలో నిర్మించాలని భావిస్తోంది.
  • కారిడార్‌–1లో స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు 34.40 కిలో మీటర్లు
  • కారిడార్‌–2: గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కిలోమీటర్లు
  • కారిడార్‌–3లో భాగంగా తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకూ 6.75 కిలోమీటర్లు మేర ఈ లైట్‌ మెట్రో కారిడార్‌ పూర్తి చేయాలని డీపీఅర్‎లో పేర్కొన్నారు. ఆ తరువాత కారిడార్‌–4లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 30.67 కిలోమీటర్లు
  • మొత్తం ఈ నాలుగు కారిడార్లలో 54 స్టేషన్లు, రెండు డిపోలు ఏర్పాటు చేసేలా డీ పీ అర్ లో పేర్కొన్న అధికారులు తాజాగా నిధుల సమీకరణ పై దృష్టి సారించబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..