AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: పంట నష్టంపై స్పీడ్‌ పెంచిన సీఎం జగన్‌.. త్వరగా నిధులు విడుదలయ్యేలా..

సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందన్న కేంద్రబృందం, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయన్నారు. ఇ-క్రాపింగ్‌ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు కుడా దీన్ని తెలియజేస్తామన్నారు. త్వరిత గతిన తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదిక...

CM Jagan: పంట నష్టంపై స్పీడ్‌ పెంచిన సీఎం జగన్‌.. త్వరగా నిధులు విడుదలయ్యేలా..
CM Jagan
P Kranthi Prasanna
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 15, 2023 | 9:00 PM

Share

తుఫాన్‌ అనంతర పరిస్థితులపై రాష్ట్రంలో పంట నష్టం ,కరువు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం సీఎం జగన్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలో గుర్తించిన అంశాలను చర్చించిన కేంద్ర బృందం పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. తుఫాన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం కావడంతో చాలా వరకు పరిస్థితులు అదుపులో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగారాన్నరు.

సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందన్న కేంద్రబృందం, విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయన్నారు. ఇ-క్రాపింగ్‌ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని, ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించదగ్గవని, ఆయా ప్రభుత్వాలకు కుడా దీన్ని తెలియజేస్తామన్నారు. త్వరిత గతిన తుఫాన్‌ కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించిన కేంద్ర కమిటీ తాము పరిశీలించిన అంశాలను వివరించారు.

అనంతపురం జిల్లా నుంచి పర్యటన ప్రారంభమై మొత్తం ఏడు జిల్లాల్లో తిరిగిన ఈ బృందం, మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశారు. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్‌ జిల్లాల్లో పర్యటించారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై ఇవాళ సీఎం జగన్‌తో జరిగిన భేటీలో చర్చించారు. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని కుడా పరిశీలించారు. వీటితో పాటు ఉపాధిహామీ పథకంపైనా కుడా పరిశీలన చేయనున్నారు.

ఇక రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు. రైతులను వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా అవగాహన కల్పించాలని,పెసలు, మినుములు, మిల్లెట్స్‌ లాంటి ఇతర పంటలవైపు మళ్లేలా చూడాలని కేంద్ర బృందం రాష్ట్రాన్ని సూచించింది. వీటిపై రాష్ట్రం చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర బృందంకు అధికారులు వివరించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని అధికారులు కోరారు. అలాగే తుఫాన్‌ కారణంగా రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు.

తుఫాన్‌ బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని అంచనా వేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో ఇ- క్రాపింగ్‌ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌ కోసం పెడతామని సీఎం అన్నారు. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తామన్నారు. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం జగన్ కేంద్ర బృందాన్ని కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..