AP Politics: జనసేనతో జై కొట్టుడా.. నైకొట్టుడా.. కలిసి ముందుకెళ్లడంపై క్లారిటీకి వచ్చిన ఏపీ బీజేపీ..
ప్రస్తుతం ఇరు పార్టీల అధ్యక్షులు కలవకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం క్యాడర్ తో కలిసి పనిచేయాలని నిర్నయానికి వచ్చాయి. మొదటి నుంచీ మిత్రపక్షం ప్రస్తావన బీజేపీ నేతలే తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల నిధులు మళ్లింపు,సర్పంచ్ ల సమస్యలపై ప్రభుత్వ తీరుపై రెండు పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. జిల్లా కేంద్రాల వద్ద జరిగిన ధర్నాల్లో బీజేపీ నాయకులతో కలిసి జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
విజయవాడ, ఆగస్టు 24: మా రెండు పార్టీలు మిత్రపక్షాలే. ఆంధ్రప్రదేశ్ లో మేము కలిసే ఎన్నికలకు వెళ్తాం.. బీజేపీ నేతలు పదేపదే చెబుతున్న మాటలివి. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. కానీ ఎక్కడా రెండు పార్టీల అధినేతలు కలిసింది లేదు. గతంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనసేనతో గ్యాప్ ఎక్కువగానే ఉండేది.ఎక్కడా రెండు పార్టీలు కలిసి ఉద్యమాలు చేసిన దాఖలాలు కూడా లేవు.
ప్రస్తుతం ఇరు పార్టీల అధ్యక్షులు కలవకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం క్యాడర్ తో కలిసి పనిచేయాలని నిర్నయానికి వచ్చాయి. మొదటి నుంచీ మిత్రపక్షం ప్రస్తావన బీజేపీ నేతలే తీసుకొస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక సంస్థల నిధులు మళ్లింపు,సర్పంచ్ ల సమస్యలపై ప్రభుత్వ తీరుపై రెండు పార్టీలు ఆందోళనలు నిర్వహించాయి. జిల్లా కేంద్రాల వద్ద జరిగిన ధర్నాల్లో బీజేపీ నాయకులతో కలిసి జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
సుమారు మూడేళ్లుగా కలిసి పోరాటాలు చేయని రెండు పార్టీలు మొదటిసారి ఒకే వేదికపై ఆందోళనకు దిగాయి. ఇకపై జనసేతో కలిసి ఉద్యమాలు చేయాలని విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు పురంధేశ్వరి.
అంశాలవారీగా కలుపుకుని వెళ్లేలా నిర్ణయం
భారతీయ జనతాపార్టీ-జనసేన కలిసి ఉద్యమాలు చేసేలా పురంధేశ్వరి కేడర్కు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎవరికి వారు సొంతంగా బలపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అంశాల వారీగా కలిసి ఉద్యమాలు చేయాలని పురంధేశ్వరి సూచించారు.ఇప్పటికే కేంద్రప్రభుత్వం గ్రామపంచాయతీలకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ బీజేపీ పదేపదే ఆరోపణలు చేస్తోంది.సర్పంచ్ ల సంఘం నేతలు పురంధేశ్వరి కలిసి తమగోడు విన్నవించుకున్నారు.అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిసి సమస్యలు చెప్పుకొన్నారు సర్పంచ్ లు.దీంతో ఈ సమస్యపై రెండు పార్టీలు కలిసి ఆందోళనకు పిలుపునిచ్చాయి.
ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొన్ని అంశాలపై పోరాటాలు చేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రజా సమస్యలతో పాటు తమ వద్దకు వచ్చే అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు నిర్వహించేలా పురంధేశ్వరి కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు చేసిన పురంధేశ్వరి.. జిల్లాల కార్యవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో మరింత దూకుడుగా ముందుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇరు పార్టీలు కలిసి ముందుకెళ్లే యోచన..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ…ప్రభుత్వంపై మరింత దూకుడుగా ఆందోళనలు చేసేలా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కొన్ని కామన్ సమస్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.రాష్ట్ర అప్పులు,కరెంట్ చార్జీల పెంపు,ఓట్ల తొలగింపు,వాలంటీర్ల వ్యవస్థ వంటి అంశాలను ఇరు పార్టీల అధినేతలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.అవకాశం దొరికినప్పుడల్లా ఇలాంటి కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే…పురంధేశ్వరి కూడా తనదైన స్టైల్ లో ఆరోపణలు కొనసాగిస్తున్నారు.ఇక రెండు పార్టీలు కలిసి ఆందోళనలు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనలతోనే కలిసి వెళ్లాలని నిర్నయించారట.రెండు పార్టీలు కలిసి చేసే ఉద్యమాలపై త్వరలో ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.మొత్తానికి ఏపీ ప్రభుత్వం టార్గెట్ గా బీజేపీ,జనసేన ముందుకెళ్తుండటంతో రాజకీయంగా చర్చకు దారితీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి