Andhra Pradesh: తొడగొట్టిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. మళ్లీ ఆయనే సీఎం అవుతారంటూ కీలక వ్యాఖ్యలు..
తమ్మినేని సీతారాం.. ఆంధ్రపదేశ్ అసెంబ్లీ స్పీకర్.. సంప్రదాయాలకు కొంచెం డిఫరెంట్ ఆయన. రాజ్యాంగ పదవిలో ఉన్నా రాజకీయం రాజకీయమే అనేది తమ్మినేని స్టయిల్.
తమ్మినేని సీతారాం.. ఆంధ్రపదేశ్ అసెంబ్లీ స్పీకర్.. సంప్రదాయాలకు కొంచెం డిఫరెంట్ ఆయన. రాజ్యాంగ పదవిలో ఉన్నా రాజకీయం రాజకీయమే అనేది తమ్మినేని స్టయిల్. ప్రతిపక్ష నేతలపై విమర్శలకైనా, సంక్షేమ కార్యక్రమాలపై పొగడ్తలకైనా తగ్గేదేలే లేదంటారు. ఈసారి ఇంకాస్త అడుగు ముందుకేసి తొడగొట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం తొడగొట్టి.. ఈసారి కూడా జగనే సీఎం అవుతారంటూ ఆశాభావం వ్యక్తంచేయడం.. న్యూ ఇయర్ రోజున చర్చనీయాంశంగా మారింది. గడప గడపకు కార్యక్రమంలో తమ్మినేని సీతారాం చంద్రబాబుపై పలు వ్యాఖ్యలు చేశారు. యువతను మోసం చేశారంటూ మండిపడడ్డారు. శ్రీకాకుళం జిల్లా బూర్జలో పార్టీ కన్వీనర్లతో సమావేశమయ్యారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు ఓ వృద్ధురాలు తనతో చెప్పిన విషయాలను సభలో ప్రస్తావించారు. మళ్లీ జగనే సీఎం అవుతారని ఆమె చెప్పిందంటూ.. తొడగొట్టారు. సీఎం జగన్ పాలన అంటే ఇదీ అంటూ తొడగొట్టి మరి చెప్పారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇలా ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, అందుకే గత ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పారంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చబోతున్నారని.. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని వివరించారు.
స్పీకర్ స్థానంలో ఉన్నా సరే రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో తమ్మినేని సీతారాం స్టయిలే వేరు. అమరావతి అంశంలోనూ, ప్రతిపక్ష నేత చంద్రబాబుపైనా కీలక వ్యాఖ్యలు చేసి గతంలో రాజకీయ కాక రేపారు. రాజ్యాంగ పదవిలో ఉన్నా ముందు వైసీపీ నేతనే అన్నది తమ్మినేని మాట. సీఎం జగన్‌కు ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానని చెబుతూ ఉంటారు.
ఇప్పుడు మరోసారి జగనే సీఎం అవుతారంటూ తొడగొట్టి మరీ తమ్మినేని చెప్పడం చర్చనీయాంశమైంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..