Pulivendula: నీ అడ్డాలో నా జెండా.. ఇదో రాజకీయ అజెండా..!
కుప్పం మున్సిపాలిటీపై 2021లో జెండా ఎగురవేసింది వైసీపీ. ఏమైందిప్పుడు? కాలం గిర్రున తిరిగింది.. మళ్లీ పసుపు జెండానే ఎగురుతోంది. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక జరుగుతోంది. ఈ హోరోహోరీ పోరులో ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. If.. ఒకవేళ.. టీడీపీ అనుకుంటున్నదే జరిగింది అనుకుందాం. అప్పుడు మాత్రం ఏమవుతుంది? కాలం గిర్రున తిరిగి.. మళ్లీ వైసీపీ జెండా ఎగరదు అనే గ్యారెంటీ ఉందా ఏమైనా? ఒక్కగానొక్క జడ్పీటీసీ. పట్టుమని 10వేల ఓట్లు. దానికే ఇంత రచ్చ జరగాలా? ఏమైనా అంటే 'ప్రతిష్టాత్మకం' అనే పదాన్ని వాడుతున్నాయి పార్టీలు. దేనికి ప్రతిష్టాత్మకం, ఎవరికి ప్రతిష్టాత్మకం? ఆనాడు కుప్పం గానీ, ఇప్పుడు పులివెందుల గానీ.. ఇలాంటి ఎన్నికల్లో విజయాలు ఎప్పటికీ తాత్కాలికమే అని తెలుగురాష్ట్రాల్లోని సగటు వ్యక్తికే అర్ధమవుతున్నప్పుడు.. రాజకీయ పార్టీలకు మాత్రం అర్థం కావడం లేదా? 'నీ అడ్డాలో నా జెండా' అంటూ సరికొత్త రాజకీయ అజెండాను ఎందుకు ఎంచుకుంటున్నాయి పార్టీలు? అసలు ఈ పోకడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ఇప్పటి వరకు జరిగిన ఈ తరహా ఎన్నికల్లో గెలిచి సాధించిందేంటి?

ప్రత్యర్ధుల అడ్డానే పార్టీల అజెండా. లేటెస్ట్ ట్రెండ్ ఏం కాదిది. రాజకీయంగా తమకు ప్రత్యర్ధులే ఉండకూడదనే భ్రమల్లోంచి పుట్టుకొచ్చిన పొలిటికల్ గేమ్ ఇది. ఇక్కడ ప్రత్యర్ధులు లేకుండా చేయడమంటే అర్థం.. ఒకరి అడ్డాలో మరొకరు పాగా వేయడం. సింపుల్‌గా చెప్పాలంటే కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ, పులివెందులలో వైఎస్ జగన్‌ను దెబ్బతీయాలని టీడీపీ వ్యూహప్రతివ్యూహాలు పన్నడం. సాధ్యాసాధ్యాల గురించి పక్కనపెడితే.. అసెంబ్లీ ఎన్నికల్లో అంతా సజావుగా సాగుతుంది. ఎవరి దారిలో వాళ్లు వెళ్తారు. ఎటొచ్చీ.. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడే నానా బీభత్సం చేస్తుంటారు. ఎందుకని? దీనివెనక రీజన్ ఏంటి? పులివెందులలో టెన్షన్ టెన్షన్..! ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..! టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి అరెస్ట్..! ఒక్క ఉప ఎన్నికకు అది కూడా జడ్పీటీసీ ఎన్నికకు ఇంత హంగామానా అనిపిస్తుంది. కాని, ఉప ఎన్నిక జరిగింది పులివెందులలో. ‘కాల్చిపడేస్తా.. యూనిఫాం ఇక్కడ’ అంటూ డీఎస్పీ మురళీ నాయక్ హైఓల్టేజ్ వార్నింగ్ ఇచ్చారంటే… పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంతటి టెన్షన్ వాతావరణాన్ని పుట్టించిందో ఊహించొచ్చు. దీనంతటికీ కారణం.. వైఎస్ జగన్ అడ్డా అయిన పులివెందులలో టీడీపీ పాగా వేయాలనుకోవడమే. ఒకరి ఇలాఖాను మరొకరు ఏలాలనే ఆలోచన ఎప్పుడు పుట్టిందయ్యా అంటే.. దానికి సమాధానం రాష్ట్ర విభజన నాటి నుంచే అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రం చిన్నదవడంతో ఆధిపత్య ధోరణి పెరిగింది. దీంతో రాజకీయాల్లో విపరీత పోకడలు కూడా మొదలయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… ఎప్పుడైతే తరం మారి...
