Pulasa Fish: బాబోయ్.. పుస్తెలమ్మినా పులస తినలేం..! ధరెంతో తెలుసా..
గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి మొదలైంది. అక్కడ పులస అత్యంత ఖరీదైన చేప. వర్షాకాలంలో పులస చేపలు చాలా తక్కువగా దొరికినా వాటి కోసం జనాలు ఎగబడి మరీ కొంటుంటారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి ప్రాంతాల్లో..
కాకినాడ, జులై 20: గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి మొదలైంది. అక్కడ పులస అత్యంత ఖరీదైన చేప. వర్షాకాలంలో పులస చేపలు చాలా తక్కువగా దొరికినా వాటి కోసం జనాలు ఎగబడి మరీ కొంటుంటారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి ప్రాంతాల్లో మాత్రమే ఇవి దొరుకుతాయి. జాలర్ల వలలకు దొరకిన పులస స్థానిక మార్కెట్లలో మంచి ధరకు విక్రయిస్తుంటారు. సాధారణంగా కిలో చేప రూ.4 వేల వరకు అమ్ముడవుతోంది. తాజాగా వర్షాకాలం ప్రారంభం కావడంతో గోదావరి జిల్లాలో ‘పులస’ చేపలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో పులస చేప ధర రూ. 20 వేలకుపైగా పలుకుతోంది. చేపల ప్రియులు సీజన్‌కు ముందుగానే బుక్ చేసుకుంటారని మత్స్యకారులు చెబుతున్నారు.
వర్షాకాలంలో సముద్రం నుంచి నదుల ఎగువ ప్రాంతాలకు పులస చేపలు సంతానోత్పత్తి కోసం వలసపోతాయి. గోదావరి నదిలోని బురద జలాలు సంతానోత్పత్తికి అనువుగా ఉంటాయి. అందుకే సంతానోత్పత్తి కోస్ం వర్షాకాలంలో మాత్రమే గోదావరికి వస్తాయి. అనతంరం చేపపిల్లలు తిరిగి సముద్రంలోకి వలసపోతాయి. పులస చేపలు చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. అందుకే వీటికి భారీగా డిమాండ్ ఉంటుందని విశాఖపట్నం మత్స్యశాఖ డైరెక్టర్ విజయ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.