- Telugu News Photo Gallery Cinema photos American Supermodel Gigi Hadid Arrested With Ganja at UK airport
ఎయిర్ పోర్టులో ప్రముఖ మోడల్ అరెస్ట్..! గంజాయి తరలిస్తూ అడ్డంగా బుక్కైన బ్యూటీ..
ప్రముఖ అమెరికన్ సూపర్ మోడల్ జిగి హదీద్ (28)ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టు చేశారు. యూకేలోని ఓవెన్ రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ విమానంలో స్నేహితురాలితో కలిసి కేమాన్ దీవులకు వెళ్లే క్రమంలో అరెస్టు..
Updated on: Jul 19, 2023 | 11:03 AM

ప్రముఖ అమెరికన్ సూపర్ మోడల్ జిగి హదీద్ (28)ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టు చేశారు. యూకేలోని ఓవెన్ రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ విమానంలో స్నేహితురాలితో కలిసి కేమాన్ దీవులకు వెళ్లే క్రమంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

మోడల్ హదీద్, ఆమె ఫ్రెండ్ జూలై 10న ఓ ప్రైవేట్ జెట్‌లో ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ కస్టమ్ అధికారులు వారి లగేజీని చెక్ చేయగా గంజాయి, గంజాయి వినియోగానికి ఉపయోగించే పరకరాలు (smoking utensils) కనిపించాయి. ఇద్దరి లగేజీలో ఇవి లభ్యమయ్యాయి.

మత్తు పదార్ధాలు కలిగివున్నందున మోడల్ హదీద్, ఆమె స్నేహితురాలిని కస్టమ్ అధికారులు అరెస్ట్ చేసి ఖైదీ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు.

ఐతే అక్కడ బెయిల్‌పై ఇద్దరు మహిళలు విడుదలైనట్లు సమాచారం. వీరు తరలిస్తున్న గంజాయి వ్యక్తిగత వినియోగానికి మాత్రమే తీసుకెళ్తున్నట్లు తెలిసింది.

జూలై 12న వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా వారు నేరాన్ని అంగీకరించారు. ఒక్కొక్కరికి వెయ్యి డాలర్ల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అందిన సమాచారం మేరకు వీరిపై ఎటువంటి నేరారోపణ కేసు నమోదు కాలేదు.





























