Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Bank Robbery: పట్టపగలు ఎస్బీఐ బ్యాంకులో లక్షల సొమ్ము దోపిడీ.. ఆ ఒక్క క్లూతో వీడిన కేసు మిస్టరీ

వాడు మామూలోడు కాదు. పోలీసులకే దిమ్మ తిరిగే భారీ స్కెచ్ వేశాడు. ఈ ఇళ్లు, వాకిళ్లు, షాపులు ,సెల్ ఫోన్లు, పొలాల్లో మోటార్లకు వాడే రాగి వైర్లు, ఇలాంటి వాటిని చోరీ చేస్తే ఏమొస్తుందను కొన్నాడు ఆ దొంగ. ఏకంగా బ్యాంక్ నే టార్గెట్ చేశాడు. పట్ట పగలు అందరూ చూస్తుండగానే కత్తితో బెదిరించి నగదు దోచుకు పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసు మిస్టరీ ఛేదించారు. ఎలా అంటారా ఈ స్టోరీ చదవండి. ఒక్క దొంగతనం తో లైఫ్ సెటిల్ అనుకుంటే ప్లాన్ తిరగబడటంతో ఊచలు లెక్కపెడుతున్నాడతడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని SBI బజార్ బ్రాంచ్ లో ఇటీవల పట్టపగలు..

SBI Bank Robbery: పట్టపగలు ఎస్బీఐ బ్యాంకులో లక్షల సొమ్ము దోపిడీ.. ఆ ఒక్క క్లూతో వీడిన కేసు మిస్టరీ
Narasapuram SBI bank robbery
Follow us
B Ravi Kumar

| Edited By: Srilakshmi C

Updated on: Nov 05, 2023 | 8:32 AM

ఏలూరు, నవంబర్‌ 5: వాడు మామూలోడు కాదు. పోలీసులకే దిమ్మ తిరిగే భారీ స్కెచ్ వేశాడు. ఈ ఇళ్లు, వాకిళ్లు, షాపులు ,సెల్ ఫోన్లు, పొలాల్లో మోటార్లకు వాడే రాగి వైర్లు, ఇలాంటి వాటిని చోరీ చేస్తే ఏమొస్తుందను కొన్నాడు ఆ దొంగ. ఏకంగా బ్యాంక్ నే టార్గెట్ చేశాడు. పట్ట పగలు అందరూ చూస్తుండగానే కత్తితో బెదిరించి నగదు దోచుకు పోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసు మిస్టరీ ఛేదించారు. ఎలా అంటారా ఈ స్టోరీ చదవండి. ఒక్క దొంగతనం తో లైఫ్ సెటిల్ అనుకుంటే ప్లాన్ తిరగబడటంతో ఊచలు లెక్కపెడుతున్నాడతడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని SBI బజార్ బ్రాంచ్ లో ఇటీవల పట్టపగలు చోరీ జరిగింది. గోల్డ్ లోన్ కావాలంటూ బ్యాంక్ క్యాషియర్ రూమ్ లో ప్రవేశించి సిబ్బందిని పొడవైన కత్తితో బెదిరించాడు ఒక అజ్ఞాత వ్యక్తి. స్టాఫ్ ఇద్దరే ఉండటంతో రూ.6.50 లక్షలు చక్కగా బ్యాగులో సర్ధుకుని పరారయ్యాడు.

ఈ చోరీ తీర ప్రాంతం లో తీవ్ర కలకలం సృష్టించింది. నర్సాపురం ప్రాంతంలో ప్రజలు భయాబ్రాంతులకు గురయ్యారు. నెత్తిన టోపీ పెట్టుకోవటం, ముఖానికి మాస్క్ ధరించటం, సి.సి కెమెరాల్లో సైతం నిందితుడు ముఖం స్పష్టంగా రాకపోవడంతో పోలీసులకు ఈ ఘటన పెను సవాల్ గా మారింది. ఈ కేసును ఎలా ఛేదించాలా అని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దొంగను పట్టుకునేందుకు జిల్లా క్రైం బ్రాంచ్ సిబ్బందిని రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. అయినా లాభం లేకపోయింది.దీంతో పోలీసులు పై ఉన్నతాధికారుల నుండి వత్తిడి పెరిగడం తో వారిలో టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో నరసాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ వాసుకి ఓ ఐడియా వచ్చింది. దొంగ వాడిన పొడవైన కత్తి పై ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడు. కత్తుల తయారీ దారుడు దగ్గరకు వెళ్ళి దొంగ వాడిన కత్తి వీడియో చూపించి ఈ కత్తి ని దేనికి వాడతారు, ఎవరు తయారు చేస్తారు అనే వివరాలు వాకబు చేశాడు. దీంతో కత్తుల తయారీ దారుడు అది పుచ్చకాయలు కోసెందుకు వాడేదని, తాను అటువంటి కత్తులు ఇటీవల రెండు తయారు చేశానని చెప్పుకొచ్చాడు.

వాటిలో ఒకటి తానేటి సురేష్ అనే అతను మూడు రో జులు క్రితం తన వద్ద కొనుక్కుని వెళ్ళాడని తెలిపాడు. దీంతో బ్యాంక్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. సురేష్ ఎవరా అని విచారణ చేయగా రుస్తుంబాద గ్రామంలో నివాసం ఉంటున్నారని తెలిసి అతని ఇంటికి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఈ దొంగతనానికి పాల్పడిన తానేటి సురేష్ బాబును నర్సాపురం మండలం రుస్తుం బాధ గ్రామంలో అరెస్టు చేసినట్లు చెప్పారు. రుస్తుంబాద్ గ్రామానికి చెందిన సురేష్ బాబు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడన్నారు. వాటిని తీర్చే మార్గం లేక బ్యాంక్ చోరీకి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు . సీసీ ఫుటేజ్,నిందితుడు వినియోగించిన కత్తిని ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుని అరెస్టు చేశామన్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ వాసుని అభినందిస్తూ రివార్డ్ అందించారు. మొత్తానికి దొంగ వాడిన కత్తి అతనిని పట్టించింది. సో నేరమంటూ చేయకూడదు, చేసిన వ్యక్తి ఎంతటి తెలివి గల వాడైనా పెట్టుబడక తప్పదని మరోసారి ఈ ఘటన రుజువు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.