Andhra Pradesh: రెండేళ్ల క్రితం అమ్మాయి విషయంలో గొడవ.. సినీ ఫక్కీలో యువకుడు కిడ్నాప్..
శ్యామ్ కు నందిగామ లోనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న అవినాష్ అనే స్నేహితుడిని అతనికి క్లాస్ మెట్స్ కు మధ్య జరిగిన ఓ గొడవలో శ్యామ్ మధ్యవర్తిగా వెళ్లి గొడవ పడ్డాడు. ఓ అమ్మాయి వ్యవహారంలో జరిగిన గొడవ అప్పట్లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న హరీష్ రెడ్డి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి దాడి చేశాడు. సినీ పక్కిలో జరిగిన ఈ కిడ్నాప్ కథ ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది.
ఎన్టీఆర్ యువకుల మధ్య పాతకక్షలు భగ్గుమన్నాయి. రెండేళ్ళ క్రితం జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ తో ఓ యువకుడినీ కిడ్నాప్ చేసి దారుణంగా దాడి చేసాడు.. సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్, దాడి జిల్లాలో సంచలనంగా మారింది. కంచిక చర్లకు చెందిన శ్యామ్ కుమార్ రెండేళ్ళ క్రితం నందిగామ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శ్యామ్ కు నందిగామ లోనే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న అవినాష్ అనే స్నేహితుడిని అతనికి క్లాస్ మెట్స్ కు మధ్య జరిగిన ఓ గొడవలో శ్యామ్ మధ్యవర్తిగా వెళ్లి గొడవ పడ్డాడు. ఓ అమ్మాయి వ్యవహారంలో జరిగిన గొడవ అప్పట్లో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న హరీష్ రెడ్డి పథకం ప్రకారం కిడ్నాప్ చేసి దాడి చేశాడు. సినీ పక్కిలో జరిగిన ఈ కిడ్నాప్ కథ ఎన్టీఆర్ జిల్లాలో సంచలనంగా మారింది.
సర్టిఫికెట్స్ కోసం వచ్చిన శ్యామ్ కుమార్ ను చాలా రోజులైంది కలుద్దాం రమ్మని మారో ఐదుగురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. అప్పటికే కార్ అద్దెకు తీసుకుని సిద్దంగా ఉన్న హరీష్ రెడ్డి శ్యామ్ ను బలవంతంగా కార్ లో ఎక్కించుకొని దాడి చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా దాదాపు నాలుగు గంటల పాటు కార్ లోనే చుక్కలు చూపించారు. కులం పేరుతో తిడుతూ పాత కక్షతో కొడుతూ హింసించారు. ముఖం పై మూత్రం పోసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. ఒంటిపై ఉన్న బంగారంతో పాటు.. చేతిలో ఉన్న డబ్బులు లాగేసుకున్నారు.
నానా రకాలుగా చిత్ర హింసలు పెట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తాం అంటు బెదిరించి గుంటూరు సమీపంలో కార్ తో సహా శ్యామ్ ను వదిలేసి పరారయ్యారు. అక్కడ నుండి ప్రాణాలతో బయటపడ్డ శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసలు విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు హరీష్ రెడ్డి తో పాటు అతనికి సహకరించిన మరో ఐదుగురు స్నేహితులని అరెస్ట్ చేశారు. నిందితులపై కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, 363, 323, 326, 386, R/W 34ఐపిసి సెక్షన్స్ కింద పలు కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్స్ కింద 10 ఏళ్లవరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..