Israel Hamas War: మరణ భయంతో అంబులెన్స్‌లో దాక్కుని ఈజిప్ట్‌కు పారిపోతున్న హమాస్ యోధులు..

'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' నివేదిక ప్రకారం బిడెన్ పరిపాలన అధికారులు ఈజిప్ట్ లో చికిత్స పొందుతున్న వారి వివరాలపై దర్యాప్తు చేశారు. ఇందులో అంబులెన్స్‌ల ద్వారా పంపబడిన గాయపడినవారిలో మూడింట ఒక వంతు మంది హమాస్ యోధుల పేర్లను కనుగొన్నారు. మరోవైపు, ఈ వారం ప్రారంభంలో తమ ఇన్‌స్పెక్టర్లు ఆక్సిజన్ ట్యాంక్‌ను దాచి ఉంచిన ట్రక్కును పట్టుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. గాజాలో హమాస్ సిద్ధం చేసిన సొరంగాలకు గాలి సరఫరా చేసేందుకు ఈ ఆక్సిజన్ ట్యాంకులు ఉపయోగించాల్సి ఉంది.

Israel Hamas War: మరణ భయంతో అంబులెన్స్‌లో దాక్కుని ఈజిప్ట్‌కు పారిపోతున్న హమాస్ యోధులు..
Israel Hamas War
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2023 | 8:53 AM

ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో US అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం ఆశ్చర్యకరమైన వాదన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్‌ల్లో గాజా స్ట్రిప్ నుంచి తమ యోధులను తరలించేందుకు హమాస్ ప్రయత్నించిందని బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి తెలిపారు. అయితే  ఈ ప్రయత్నం విఫలమైంది. ఎందుకంటే యుద్ధంలో గాయపడిన వారిని గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు పంపించారు. అయితే ఈ గాయపడిన వారి జాబితాను పరిశీలించినప్పుడు.. గాయపడిన వారి పేర్లకు బదులుగా హమాస్ యోధుల పేర్లను అందులో ఉన్నాయని తమ దృష్టిలోకి వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది.

‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ నివేదిక ప్రకారం బిడెన్ పరిపాలన అధికారులు ఈజిప్ట్ లో చికిత్స పొందుతున్న వారి వివరాలపై దర్యాప్తు చేశారు. ఇందులో అంబులెన్స్‌ల ద్వారా పంపబడిన గాయపడినవారిలో మూడింట ఒక వంతు మంది హమాస్ యోధుల పేర్లను కనుగొన్నారు.

మరోవైపు, ఈ వారం ప్రారంభంలో తమ ఇన్‌స్పెక్టర్లు ఆక్సిజన్ ట్యాంక్‌ను దాచి ఉంచిన ట్రక్కును పట్టుకున్నారని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. గాజాలో హమాస్ సిద్ధం చేసిన సొరంగాలకు గాలి సరఫరా చేసేందుకు ఈ ఆక్సిజన్ ట్యాంకులు ఉపయోగించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

టన్నెల్స్‌లో సరఫరా కోసం వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకుల సీజ్

ఇజ్రాయెల్ ఇన్‌స్పెక్టర్లు విచారణ జరిపి ట్రక్కులో దాచిన ఆక్సిజన్ ట్యాంకులు ఆసుపత్రుల్లో ఉపయోగించడం లేదని కనుగొన్నారు. కుక్కీ పెట్టెల మధ్య ఆక్సిజన్ ట్యాంకర్లను అక్రమంగా తరలిస్తున్నారు. మొత్తం ట్రక్కును పరిశీలించిన తర్వాత గాజాలోకి ప్రవేశించకుండా నిలిపివేసినట్లు అధికారి తెలిపారు. అయితే ఆక్సిజన్‌ను తీసుకువెళుతున్న ట్రక్కు చిత్రాన్ని ఏ అధికారి అందించలేదు..  ట్రక్కును ఎవరు పంపారో చెప్పలేదు.

గాజాలోకి ప్రవేశించడానికి ముందు ట్రక్కుల తనిఖీ

నిజానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత వందల కొద్దీ ట్రక్కులు సహాయక సామగ్రిని తీసుకుని గాజా సరిహద్దుకు చేరుకుంటున్నాయి. ఈ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించడానికి ముందు, ఇజ్రాయెల్ సైనికులు వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఆపై వాటిని మరింత ముందుకు సాగడానికి అనుమతినిస్తున్నారు. గురువారం సుమారు 100 ట్రక్కులు సహాయక సామాగ్రిని తీసుకుని గాజాలోకి ప్రవేశించాయి. రానున్న రోజుల్లో ట్రక్కుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?