Indians: అమెరికాలో ఏడాది కాలంలో దాదాపు 97 వేల మంది భారతీయుల అరెస్ట్.. ఎందుకంటే..!

Indians: అమెరికాలో ఏడాది కాలంలో దాదాపు 97 వేల మంది భారతీయుల అరెస్ట్.. ఎందుకంటే..!

Anil kumar poka

|

Updated on: Nov 05, 2023 | 8:47 AM

అమెరికా వెళ్లాలని, అక్కడ డాలర్లు సంపాదించి, విలాసవంతమైన జీవనం గడపాలని ఎందరో కలలు కంటారు. అది కొందరికి కలగానే మిగిలిపోతుంది. మరికొందరు ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని అక్రమార్గంలో ప్రయత్నిస్తుంటారు. అడ్డదారిలో అమెరికా వెళ్లి కటకటాలపాలవుతారు. ఇలాంటివారి జాబితాలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. ఏడాది వ్యవధిలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన దాదాపు 97 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు.

అమెరికా వెళ్లాలని, అక్కడ డాలర్లు సంపాదించి, విలాసవంతమైన జీవనం గడపాలని ఎందరో కలలు కంటారు. అది కొందరికి కలగానే మిగిలిపోతుంది. మరికొందరు ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని అక్రమార్గంలో ప్రయత్నిస్తుంటారు. అడ్డదారిలో అమెరికా వెళ్లి కటకటాలపాలవుతారు. ఇలాంటివారి జాబితాలో భారతీయుల సంఖ్య చాలా ఎక్కువే ఉంది. ఏడాది వ్యవధిలోనే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన దాదాపు 97 వేల మంది భారతీయులు అరెస్టయ్యారు. ఈ విషయాన్ని అమెరికా కస్టమ్స్‌-బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం ప్రకటించింది. అమెరికాకు అక్రమ వలసలపై నవంబర్‌ 2న సెనేట్‌లో కీలకమైన చర్చ జరిగింది. మెక్సికోలో అక్రమ వలసలకు సాయం చేయడం వ్యాపారంగా మారిందని, డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలు వలసదారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని సెనేటర్‌ జేమ్స్‌ లాంక్‌ఫోర్డ్‌ ఆరోపించారు. ఒకవేళ పట్టుబడితే ఎలా తప్పించుకోవాలో, అధికారులకు ఏం సమాధానం చెప్పాలో కూడా శిక్షణ ఇస్తున్నారని వెల్లడించారు. స్వదేశంలో భయానక పరిస్థితుల కారణంగా ఆశ్రయం కోసం వచ్చామని చెప్పాలని శిక్షణ ఇస్తున్నట్టు చర్చలో భాగంగా పేర్కొన్నారు. కాగా అమెరికా చేరడానికి ఇండియన్స్ అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని అమెరికా కస్టమ్స్‌-బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం గుర్తించింది. గతేడాది అక్టోబరు నుంచి ఈ సంవత్సరం సెప్టెంబరు 30 వరకు మొత్తం 96,917 మంది భారతీయులను అరెస్టు చేసినట్టు అమెరికా కస్టమ్స్‌-బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తన ప్రకటనలో పేర్కొంది. వీరిలో అత్యధికంగా 40 వేల మంది మెక్సికో సరిహద్దులో, 30 వేల మంది కెనడా సరిహద్దులో పట్టుబడ్డారని వెల్లడించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.