Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Hamas War: పాలస్తీనాకు మద్దతుగా మెక్‌డొనాల్డ్స్‌లో భారీగా ఎలుకలను వదిలిన యువకుడు.. వీడియో వైరల్

ఈ వ్యక్తి మెక్‌డొనాల్డ్‌ వద్దనే ఎందుకు నిరసన తెలిపాడు అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. దీనికి కారణం చాలా చిన్నది. వాస్తవానికి, హమాస్‌తో యుద్ధంలో పాల్గొంటున్న ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారం ఇస్తామని మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఈ వ్యక్తి తన నిరసనను ప్రకటించడానికి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ను ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.

Israel Hamas War: పాలస్తీనాకు మద్దతుగా మెక్‌డొనాల్డ్స్‌లో భారీగా ఎలుకలను వదిలిన యువకుడు.. వీడియో వైరల్
Israel Hamas WarImage Credit source: TikTok
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2023 | 5:15 PM

అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ , హమాస్ మధ్య విధ్వంసక యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉంటే బ్రిటన్‌ నుంచి ఓ వీడియో వైరల్‌గా మారడంతో జనం ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి, ఒక పాలస్తీనా మద్దతుదారుడు భిన్నమైన నిరసన పద్ధతిని అవలంబించాడు, ఇది ప్రజలలో భయాందోళనలను కలిగించింది. ఇజ్రాయెల్ .. హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లోని ఆయా దేశ ప్రజలు తమ పౌరులకు మద్దతు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాలల్లో ఆందోళన కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఒక పాలస్తీనా మద్దతుదారుడు ప్రజలను భయపెట్టేందుకు తన నిరసన తెలియజేసేందుకు వింత పద్ధతిని అనుసరించాడు. వైరల్ అయిన క్లిప్‌లో, ఈ వ్యక్తి మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌లో డజన్ల కొద్దీ ఎలుకలను విడుదల చేయడం చూడవచ్చు. సదరు వ్యక్తి చేసిన ఈ చర్య వల్ల తింటున్న కస్టమర్లు భయంతో అక్కడికి పరుగులు తీశారు.

ఈ షాకింగ్ వీడియో బర్మింగ్‌హామ్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్ కు సంబంధించినది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తలపై పాలస్తీనా జెండాను ధరించాడు. దీని తరువాత అతను కారు వెనుక ఉన్న డిక్కీని తెరచి అందులో ఉన్న వివిధ బాక్సులను కిందకు తీశాడు. ఆ వివిధ ప్లాస్టిక్ బాక్సుల్లో డజన్ల కొద్దీ ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు,  నలుపు ఎలుకలున్నాయి. తర్వాత ఈ ఎలుకలను మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లి వదిలేశాడు. యువకుడు చేసిన పనిని చూసిన వారు సహజంగానే భయపడ్డారు. అవుట్‌లెట్‌లో ఉన్న కస్టమర్‌లు భయపపడి అటు ఇటు పరుగులు తీయడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

రెస్టారెంట్‌లో ఎలుకలను విడుదల చేసిన వీడియోను ఇక్కడ చూడండి

‘ఫ్రీ పాలస్తీనా’ నినాదాలు

వీడియోలోని వ్యక్తి నకిలీ నంబర్ ప్లేట్‌తో ఉన్న కారుతో రెస్టారెంట్ దగ్గరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై PAISTN ఫ్రీ పాలస్తీనా అని వ్రాయబడింది. అంతేకాదు ఆ వ్యక్తి కారు వద్దకు తిరిగి వస్తూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని పదేపదే అరవడం వినిపిస్తుంది. డ్రైవింగ్ చేయడానికి ముందు.. ‘ఇజ్రాయెల్‌ను బహిష్కరించండి’ అనే నినాదాలను కూడా చేశాడు.

ఇలా చేయడానికి కారణం ఏమిటంటే..

ఈ వ్యక్తి మెక్‌డొనాల్డ్‌ వద్దనే ఎందుకు నిరసన తెలిపాడు అని ఎవరైనా ఆలోచిస్తుంటే.. దీనికి కారణం చాలా చిన్నది. వాస్తవానికి, హమాస్‌తో యుద్ధంలో పాల్గొంటున్న ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత ఆహారం ఇస్తామని మెక్‌డొనాల్డ్స్ ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఈ వ్యక్తి తన నిరసనను ప్రకటించడానికి మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ ను ఎంచుకున్నట్లు అనుమానిస్తారు.

మెక్‌డొనాల్డ్స్ ఏం చెప్పింది?

మెక్‌డొనాల్డ్ ఈ సంఘటనను ధృవీకరించింది. బర్మింగ్‌హామ్ స్టార్ సిటీ రెస్టారెంట్ లోపల అనేక ఎలుకలను విడుదల చేసినట్లు తెలిపింది. రెస్టారెంట్ పూర్తిగా శుభ్రం చేశామని ఇప్పుడు కస్టమర్స్ కు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..