AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh – Odisha: మరో మలుపు తిరిగిన ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లోని కొటియా ఇష్యూ.. అక్కడ ఏం జరుగుతుందంటే..

Andhra Pradesh - Odisha: ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లోని కొటియా ఇష్యూ టర్నింగ్‌ల మీద టర్నింగ్‌లు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల అధికారులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. సమస్యను సాగదిస్తున్నారు.

Andhra Pradesh - Odisha: మరో మలుపు తిరిగిన ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లోని కొటియా ఇష్యూ.. అక్కడ ఏం జరుగుతుందంటే..
Andhra Odisha
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2021 | 10:38 PM

Share

Andhra Pradesh – Odisha: ఆంధ్ర-ఒడిశా బోర్డర్‌లోని కొటియా ఇష్యూ టర్నింగ్‌ల మీద టర్నింగ్‌లు తీసుకుంటోంది. రెండు రాష్ట్రాల అధికారులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. సమస్యను సాగదిస్తున్నారు. ఒడిశా అధికారులను ఎదురించిన గ్రామాల్లో ప్రత్యేక స్కూల్‌ని ఏర్పాటు చేసి.. పిల్లలను చేర్పించారు. దాంతో ఒడిశా బోర్డర్‌లోని కొటియా సమస్య కొత్త మలుపు తిరిగింది. ప్రజలంతా ఏపీలోనే ఉంటామని ప్రకటించడంతో ఒడిశా అధికారులు దూకుడు పెంచారు. కొటియా మూలతాడి వలలో ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి.. వెంటనే తరగతులను కూడా ప్రారంభించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి సుమారు వంద మంది బాలబాలికలను జాయిన్ చేయించారు అధికారులు. అయితే.. గిరిజనులు తిరుగుబాటు చేస్తారన్న సమాచారంతో ముందుగానే గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఒడిశా పోలీసులు. దీనంతటికి కారణం కూడా గట్టిగానే ఉంది.

ఒడిశా అధికారులను ఎదురించిన కొటియా వీరులకు విజయనగరం జిల్లా కలెక్టర్‌ సోమవారం నాడు సన్మానం చేశారు. ఒడిస్సా పోలీసుల నిర్బంధాన్ని, అధికారుల వేధింపులపై తెగించి పోరాటం చేస్తున్న కొటియా గ్రామస్థుల తెగువను అభినందించారు. కొటియా గ్రామస్థులను రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. వీరి పోరును మెచ్చుకున్న కలెక్టర్‌.. ఘన స్వాగతం పలికారు. కలెక్టర్‌ సూర్యకుమారి ఆత్మీయ సన్మానం చేశారు. ఒడిస్సా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాము అంతా ఆంధ్రా వైపే ఉంటామని కలెక్టర్‌కు తెలిపారు గ్రామస్తులు. దీన్నే ఛాలెంజ్‌గా తీసుకున్న అధికారులు.. ఒక్కరోజులోనే స్కూల్‌ను ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఒడిశా-ఆంధ్ర బోర్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒడిశా అధికారులు పెట్టిన నిర్బంధాన్ని ఛేదించారు. తాము ఏపీకి చెందిన పౌరులమేనంటూ చాటిచెప్పారు. ఒడిశా అధికారులు, పోలీసులపై తిరగబడ్డారు. అక్కడి రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డులను విసిరి కొట్టడంతో సమస్య మొదలయింది.

Also read:

PAK vs NZ Match: పీకల్లోతు కష్టాల్లోకి జారుకుంటోన్న పాకిస్తాన్‌.. లక్ష్య చేధనలో విజయాన్ని చేరేనా.?

Tomato Price: టమోటా రైతుకు గుడ్‌ న్యూస్‌.. చుక్కలను తాకిన టమోటా ధరలు.. ఈ రోజు ధర ఎంతో తెలుసా..

Mahabubnagar: మద్యం మత్తులో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడిన చిన్నారి.. మండుటెండను సైతం లెక్క చేయకుండా..