Tomato Price: టమోటా రైతుకు గుడ్‌ న్యూస్‌.. చుక్కలను తాకిన టమోటా ధరలు.. ఈ రోజు ధర ఎంతో తెలుసా..

టమోటా రైతుకు గుడ్‌ న్యూస్‌. మొన్నటి వరకు కనీస మద్ధతు ధర లేక డీలా పడిన అన్నదాతలకు.. ఇప్పటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వర్షాలు జోరుగా..

Tomato Price: టమోటా రైతుకు గుడ్‌ న్యూస్‌.. చుక్కలను తాకిన టమోటా ధరలు.. ఈ రోజు ధర ఎంతో తెలుసా..
Tomato
Follow us

|

Updated on: Oct 26, 2021 | 10:32 PM

టమోటా ధరలు మార్కెట్‌లో మండిపోతున్నాయి. పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో కిలో 55 రూపాయలకు పెరిగింది. ఈ ధరలపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వినియోగ దారులకు మాత్రం భారంగా మారాయి. టమోటా రైతుకు గుడ్‌ న్యూస్‌. మొన్నటి వరకు కనీస మద్ధతు ధర లేక డీలా పడిన అన్నదాతలకు.. ఇప్పటి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వర్షాలు జోరుగా పడిన వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతనడంతో దిగుబడులు అంతగా రాలేదు. తక్కువ స్థాయిలో వచ్చిన దిగుబడులకు మార్కెట్‌లో మంచి ధర అందుబాటలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లోనే కిలో టమోటా 40 రూపాయలకు పైనా పలుకుతోంది.

కర్నూలు జిల్లా పత్తి కొండ వ్యవసాయ మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పెరిగిపోయాయి. కిలో 55 రూపాయలు పలుకుతోంది. కర్నూలు చుట్టు పక్కల ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పంట తీవ్రంగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయింది. రోజు వారీగా మార్కెట్‌కు వచ్చే సరుకు కూడా తగ్గిపోయింది. వచ్చిన సరుకుకు మంచి ధర లభిస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెల రోజుల క్రితమే టమోటాకు సరైన ధరలు లేక, మార్కెట్‌లో కొనే వారు లేక రోడ్డు పక్కనే పడేసిన దృశ్యాలు కూడా కనిపించాయి. వీటిని చూసిన సగటు వ్యక్తులు అయ్యో పాపం అన్నారు. కొంత మంది రైతులు అయితే.. పంట కూడా తీయకుండా పొలంలోనే వదిలేశారు. తీస్తే కూలీలు మీద పడుతాయన్న భయంతో అలానే వదిలేశారు.

అలాంటిది.. ఇప్పుడు ఏర్పడ్డ పరిస్థితులో మంచి ధరలు వస్తున్నాయి. మార్కెట్‌కు సరుకు తీసుకొచ్చిన రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయని సంతోష పడుతున్నారు. ఇలాంటి ధరలు ఏడాది పొడవునా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..

EPFO Alert: PF ఖాతాదారులకు ముఖ్య సూచన.. ఇంట్లో కూర్చుని మీ UAN నంబర్ తెలుసుకోవచ్చు.. అది ఎలాగంటే..