AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubnagar: మద్యం మత్తులో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడిన చిన్నారి.. మండుటెండను సైతం లెక్క చేయకుండా..

Mahabubnagar: మద్యం మత్తులో ఉన్న తండ్రిని గంటల తరబడి మండుటెండలో తన కాళ్ళపై పడుకోబెట్టుకుని తండ్రిని రక్షించుకుని.. తండ్రి పట్ల ప్రేమను చాటుకున్నాడు..

Mahabubnagar: మద్యం మత్తులో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడిన చిన్నారి.. మండుటెండను సైతం లెక్క చేయకుండా..
Son And Father
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2021 | 10:31 PM

Share

Mahabubnagar: మద్యం మత్తులో ఉన్న తండ్రిని గంటల తరబడి మండుటెండలో తన కాళ్ళపై పడుకోబెట్టుకుని తండ్రిని రక్షించుకుని.. తండ్రి పట్ల ప్రేమను చాటుకున్నాడు ఓ తనయుడు. తండ్రి పై ఆధారపడే పసి వయస్సులో.. ఆ చిన్నారి తన తాగుబోతు తండ్రికి స్పృహ వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. జడ్చర్లలో జరిగిన ఈ ఘటనను‌ చూసిన స్థానికులు చిన్నారిపై జాలి చూపి, తండ్రిని అసహ్యించుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కన్యకాపరమేశ్వరి వీధిలోని మద్యం మత్తులో ఓ తండ్రి స్పృహ కోల్పోయాడు. సోయి లేకుండా పడిపోయాడు. తండ్రి ఇబ్బందులకు గురి కాకుండా రోడ్డు పక్కనే మండుటెండలో చీమలు కుడుతున్నా లెక్కచేయకుండ గంటల తరబడి తన కాళ్ళపై పడుకోబెట్టుకున్నాడు చిన్నారి కొడుకు. తండ్రిని రక్షించుకుంటూ.. స్పృహ వచ్చేంత వరకు కంటిరెప్పలా చూసుకున్నాడు. జడ్చర్ల మండలం కొత్త తండా కు చెందిన మన్య నాయక్ తన బైక్ రిపేర్ కోసం జడ్చర్లకు కొడుకు హరీష్ తో కలసి వచ్చాడు. మన్యానాయక్ పూటుగా మద్యం సేవించి‌ స్పృహ కోల్పోయాడు. నిలబడే ఓపిక కూడా లేనంతగా తాగేశాడు. తూలుతున్న తన తండ్రిని చూసి ఏమి చేయలేక రోడ్డు పక్కనే తన కాలు చాచి తండ్రిని కాళ్లపై పడుకోబెట్టుకున్నాడు. ఎంత బాధ అవుతున్నా తట్టుకొని తండ్రి ని రక్షించుకున్నాడు. తన కాళ్ళపై పడుకోబెట్టుకుని అలాగే కూర్చున్నాడు. మద్యం మత్తు దిగాక.. ఇద్దరు ఇంటి బాట పట్టారు. ఇలా తండ్రిని రక్షించుకున్న తనయుడుని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. మరికొంతమంది చిన్నారి పట్ల జాలిని చూపారు.. తాగు బోతు తండ్రిని అసహ్యించుకున్నారు.

Also read:

Hyderabad: యువకుడి ఆత్మహత్య.. ఫోన్ అమ్మకపోతే ‘ఒట్టు’ అంటూ సూసైడ్ నోట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Huzurabad By-Election: కొన్ని గంటలే.. మైక్‌లు మూగబోతాయి.. ఇక తెర వెనుక ఆట షురు..

Kitchen Tips: ఇంటికి తీసుకొచ్చిన ఆలుగడ్డలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి