Huzurabad By-Election: కొన్ని గంటలే.. మైక్‌లు మూగబోతాయి.. ఇక తెర వెనుక ఆట షురు..
ఇక కొన్ని గంటలే.. మైక్‌లు మూగబోతాయి.. ప్రచారానికి వెళ్లిన జనం ప్యాకప్. అంతే.. ఇక తెర వెనుక నాట్యం మొదలవుతుంది.
ఇక కొన్ని గంటలే.. మైక్‌లు మూగబోతాయి.. ప్రచారానికి వెళ్లిన జనం ప్యాకప్. అంతే.. ఇక తెర వెనుక నాట్యం మొదలవుతుంది. మిగిలున్న సమయాన్ని డబ్బు, మద్యం పంపిణీకి కేటాయిస్తారు అభ్యర్థులు. ఆఖరి క్షణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మొదలవుతాయి. నువ్వా నేనా అంటూ సాగిన హుజురాబాద్ ఎన్నికల క్యాంపెయిన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు ధాన,ధర్మ, దండోపయాలను ప్రయోగిస్తున్నాయి. 30 న జరగనున్న ఉప ఎన్నికకు పార్టీలన్ని చేస్తునన్న ప్రచారం చివరి దశకు చేరకుంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో దిగారు. ఈటలతో పాటు కమలనాధులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈటల గెలిస్తే తెలంగాణలో BJP బలం మరింత పెరుగుతుంది. దీని వల్ల రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునే అవకాశం ఉంటుంది.
ఈ పరిణామాలతో బీజేపీ ఈటల గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తుంది. ఈటలకు జరిగిన అన్యాయం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారానికి సాయంత్రంతో గడువు ముగియనుండడంతో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, విజయశాంతి, ధర్మపురి అరవింద్, రఘనందనరావు, జితేందర్ రెడ్డి తదితరులు ఇక్కడే మకాం వేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారానికి కొన్ని గంటలే ఉండడంతో ఆయా పార్టీల నేతలు ఇంటింటికీ వెళ్తు ప్రచారం నిర్వహిస్తున్నారు.
అధికార పార్టీ తరఫున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే హుజురాబాద్‌లోనే ఉంటూ ప్రచారంలో పాల్గొంటు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు.
ఇవి కూడా చదవండి: Kid Safety: బైక్‌పై పిల్లలను తీసుకెళ్తున్నారా.. నియమాలు తెలియకపోతే బుక్కైనట్లే..
EPFO Alert: PF ఖాతాదారులకు ముఖ్య సూచన.. ఇంట్లో కూర్చుని మీ UAN నంబర్ తెలుసుకోవచ్చు.. అది ఎలాగంటే..