Hyderabad: యువకుడి ఆత్మహత్య.. ఫోన్ అమ్మకపోతే ‘ఒట్టు’ అంటూ సూసైడ్ నోట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని బహుదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్న యువకుడు..

Hyderabad: యువకుడి ఆత్మహత్య.. ఫోన్ అమ్మకపోతే ‘ఒట్టు’ అంటూ సూసైడ్ నోట్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Phone
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 26, 2021 | 10:22 PM

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలోని బహుదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో పోరాడుతున్న యువకుడు.. ఇంట్లో తెలిస్తే బాధపడుతారని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోతున్నందుకు క్షమించండి అంటూ తల్లిదండ్రులను వేడుకున్నాడు ఆ యువకుడు. పైగా.. తన ఫోన్ అమ్మి అంతిమ సంస్కారాలు నిర్వహించాలంటూ చివరి కోరిక కోరాడు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కిషన్‌బాగ్ ఎన్ఎం గూడకు చెందిన పవన్(17) మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు.. ఉరికి వేలాడుతున్న పవన్ మృతదేహాన్ని కిందకు దించారు. పవన్ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అయితే, పవన్ మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. అది చదివిన కుటుంబ సభ్యులు మరింత కన్నీటిపర్యంతం అయ్యారు.

‘‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి.. నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్న.. నన్ను మరచిపోండి ప్లీస్.. నాకు వారం కిందట గుండె పోటు వచ్చింది.. మిమ్మల్ని బాధపెట్టవద్దని చెప్పలేదు మీకు.. సోదరునికి చెప్పండి నా ఫోన్ ను అమ్మగా వచ్చిన డబ్బులతో నా అంతిమ సంస్కారాలు చేయాలని.. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది.. సోదరా నన్ను క్షమించు.. నీకు ఎప్పుడూ విలువ ఇవ్వలేదు.. సోదరిని ఎవరైనా ఏడిపిస్తే సోదరునికి చెప్పండి.. గుడ్ బాయ్ అమ్మ, నాన్న.. ఐ లవ్ యు అమ్మ-నాన్న మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా ఫోన్ అమ్మకపోతే నా మీద ఒట్టు.’’ పవన్ సూసైడ్ లేఖ రాసి ప్రాణాలు కోల్పోయాడు.

కాగా, పవన్ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పవన్ మృతదేహానికి పంచనామా నిర్వహించి.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్ నూర్ మొహమ్మద్, హైదరాబాద్, టీవీ9 తెలుగు.

Also read:

Huzurabad By-Election: కొన్ని గంటలే.. మైక్‌లు మూగబోతాయి.. ఇక తెర వెనుక ఆట షురు..

Kitchen Tips: ఇంటికి తీసుకొచ్చిన ఆలుగడ్డలు ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి

Privatization: విమానాశ్రయాల ప్రైవేటీకరణలో స్పీడప్.. మార్చి నాటికి ఎన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించనున్నారంటే..

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..