Andhra Pradesh: నాట్యాచార్యుడు వీరజయల్‌కు ప్రతిష్టాత్మక ‘నృత్యకళాశ్రీ’ బిరుదు ప్రదానం
కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ నలుమూలల అందిస్తున్న నాట్యా చార్యుడు వీరజయల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే 500 మందికి పైగా కూచిపూడి నాట్యాన్ని అందించిన ఆయనను అనుకోకుండా వచ్చిన బిరుదు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నాట్యాచార్యుడు వీరజయల్ ఓ వైపు కూచిపూడి నృత్య గురువుగా రాణిస్తూనే మరోవైపు యువతకు మంచి సందేశం అందించాలని లఘుచిత్రం చిత్రీ కరణకు శ్రీకారం చుట్టారు..

ఆదోని, ఫిబ్రవరి 1: కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ నలుమూలల అందిస్తున్న నాట్యా చార్యుడు వీరజయల్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే 500 మందికి పైగా కూచిపూడి నాట్యాన్ని అందించిన ఆయనను అనుకోకుండా వచ్చిన బిరుదు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నాట్యాచార్యుడు వీరజయల్ ఓ వైపు కూచిపూడి నృత్య గురువుగా రాణిస్తూనే మరోవైపు యువతకు మంచి సందేశం అందించాలని లఘుచిత్రం చిత్రీ కరణకు శ్రీకారం చుట్టారు. కొవిడ్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అప్రమత్తత, వైద్యులు, పోలీసు శాఖ, పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో ఎస్ఎంఎస్ అనే లఘుచిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్రం సామాజిక మాధ్యమంలో మంచి ప్రాచుర్యం పొందింది. తర్వాత గత ఏడాది యువత పెడదారి పట్టకుండా ఉండేందుకు సందేశాత్మకంగా ‘ఆశయం’ అనే లఘుచిత్రం చిత్రీకరించి పలువురి ప్రశంసలు పొందారు. గత నెలలో హైదరాబాద్లో ఓ టీవీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శతలఘు చిత్రోత్సవాల్లో ‘ఆశయం’ చిత్రాన్ని ప్రదర్శించారు. న్యాయనిర్ణేతలు మనసును గెలుచుకున్న ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. దర్శకుడు-వీరజయల్‌ను ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు నర్సింగరావు అవార్డు ప్రదానం చేసి సత్కరించారు.
వందల సంఖ్యలో శిష్యగణం
ఆదోని పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న బాబు, నారాయణమ్మ దంపతుల కుమారుడు మాన్వి వీరజ్రాయల్ 2010 నుంచి నాట్యగురువు డాక్టరు పట్నం శివప్రసాద్ వద్ద కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం పొందారు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో ఆదోని పట్టణంలో శ్రీగురుకృప కూచిపూడి నాట్యాలయం స్థాపించి విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 500 మంది వరకు కళాకారులను తీర్చిదిద్దారు. కూచిపూడిలో సేవలు అందిస్తున్న వీరజయల్ను కోలతాలో జరిగిన నాటరాజోత్సవంలో నిర్వాహకులు నృత్యకళాశ్రీ బిరుదును ప్రధానం చేశారు. 2015 ఏడాదిలో ఆదోని పట్టణంలో శ్రీగురుకృప కూచి పూడి నాట్యాలయం స్థాపించి విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 500 మంది వరకు కళాకారులను తీర్చిదిద్దారు. కూచిపూడిలో సేవలు అందిస్తున్న వీరజయల్ను కోలతాలో జరిగిన నాటరాజోత్సవంలో నిర్వాహ కులు నృత్యకళాశ్రీ బిరుదును ప్రదానం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




