కుదిరితే బెజవాడ వెస్ట్ లేదంటే.. ఆ పార్లమెంట్ సీట్ : బాబు, పవన్‌లు వెంకన్న రిక్వెస్ట్

Ram Naramaneni

|

Updated on: Feb 01, 2024 | 1:48 PM

పోటీ చేసే విషయంలో తగ్గేదే లేదంటున్న బుద్ధా వెంకన్న…. తనకు చంద్రబాబు దైవసమానులన్నారు. అధినేత నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలన్నారు. పవన్‌ కల్యాణకు కూడా ఇదే విజ్ఙప్తి చేస్తానన్నారు. తన నివాసం నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించారు.. ఒకవేళ విజయవాడ పశ్చిమ స్థానం తనకు ఇవ్వడం సాధ్యం కాదనుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానమైనా ఇవ్వాలని బుద్ధా వెంకన్న అంటున్నారు.. అయితే బుద్ధా వెంకన్న ఆశించే రెండు స్థానాలనూ జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

పోటీ చేసే విషయంలో తగ్గేదే లేదంటున్న బుద్ధా వెంకన్న…. తనకు చంద్రబాబు దైవసమానులన్నారు. అధినేత నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని చెప్పుకొచ్చారు. పార్టీని అంటిపెట్టుకున్న వారికి నమ్మకం మీద టిక్కెట్లు ఇవ్వాలన్నారు. పవన్‌ కల్యాణకు కూడా ఇదే విజ్ఙప్తి చేస్తానన్నారు. తన నివాసం నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్ వరకూ ర్యాలీ నిర్వహించిన బుద్దా వెంకన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని తాజా వార్తలు ఇక్కడ చదవండి